జంక్‌ఫుడ్‌ను దూరం పెట్టాల‌నుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ మీకే!

ఈ మ‌ధ్య కాలంలో పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా చాలా మంది జంక్ ఫుడ్‌కి బాగా అల‌వాటు ప‌డిపోయారు.

తిన‌డానికి జంక్ ఫుడ్ ఎంతో టేస్టీగా ఉంటుంది.జంక్ ఫుడ్ ముందు ఆరోగ్యకరమైన ఆహారలు బ‌లాదూర్ అన‌డంలో సందేహ‌మే లేదు.

కానీ, జంక్ ఫుడ్ ఎంత రుచిగా ఉన్న‌ప్ప‌టికీ.శ‌రీరానికి ఎటు వంటి పోష‌కాలు అంద‌వు.

పైగా ఊబ‌కాయం, గుండె జ‌బ్బులు, క్యాన్స‌ర్‌, మ‌ధుమేహం, ర‌క్త పోటు వంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను తెచ్చి పెట్ట‌డంలో జంక్ ఫుడ్సే ముందుంటాయి.

అందుకే వీటిని దూరం పెట్ట‌డానికి కొంద‌రు తెగ ప్ర‌య‌త్నిస్తుంటారు.కానీ, నోరు క‌ట్టుకోలేక వాటిని లాగించేస్తారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్‌ను గ‌నుక పాటిస్తే చాలా స‌ల‌భంగా జంక్ ఫుడ్స్‌ను ఎవైడ్ చేయ‌వ‌చ్చు.

మ‌రి లేటెందుకు ఆ టిప్స్ ఏంటో ఓ లుక్కేసేయండి.జంక్ ఫుడ్‌ను దూరం పెట్టాల‌నుకుంటే.

శ‌రీరానికి స‌రిప‌డా ప్రోటీన్‌ను త‌ప్ప‌కుండా తీసుకోవాలి.ప్రోటీన్ ఫుడ్ తీసుకోవ‌డం వ‌ల్ల పొట్ట నిండుగా ఉంటుంది.

దాంతో జంక్ ఫుడ్స్‌పై మ‌న‌సు మ‌ల్ల‌కుండా ఉంటుంది.అలాగే ఒత్తిడితో బాధ ప‌డే వారు జంక్ ఫుడ్స్‌ను ఎక్కువ‌గా తింటుంటారు.

అందుకే ఒత్తిడిని ఎంత త‌గ్గించుకుంటే.జంక్ ఫుడ్స్‌కు అంత దూరంగా ఉండొచ్చు.

అయితే ఒత్తిడిని త‌గ్గించుకునేందుకు ప్ర‌తి రోజు యోగా, ధ్యానం చేయాలి. """/"/ రాత్రుళ్లు కంటి నిండా నిద్ర పోవ‌డం ద్వారా కూడా జంక్ ఫుడ్స్‌ను దూరం పెట్ట‌వ‌చ్చ‌ట‌.

అవును, కంటి నిండి నిద్ర ఉంటే.ప‌గ‌టి పూట ఆక‌లి చాలా త‌క్కువ ఉంటుంద‌ట‌.

త‌ద్వారా జంక్ ఫుడ్స్‌పై ఆస‌క్తి త‌గ్గుతుంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇక వాట‌ర్‌ను ఎక్కువ‌గా సేవిస్తూ ఉండాలి.

అలా చేయ‌డం వ‌ల్ల శ‌రీరం హైడ్రేటెడ్‌గా ఉండ‌ట‌మే కాదు.అతి ఆక‌లి త‌గ్గి జంక్స్ ఫుడ్స్ వైపు మ‌న‌సు వెళ్ల‌కుండా ఉంటుంది.

మ‌రియు బాగా ఆక‌లి వేస్తున‌ప్పుడు జంక్ ఫుడ్స్ కాకుండా న‌ట్స్‌, తాజా పండ్లు తీసుకోండి.

దాంతో ఆక‌లి తీరుతుంది.ఆరోగ్యం పెరుగుతుంది.

బన్నీ డ్రీమ్ రోల్ ఏంటో తెలుసా… ఆ పాత్రలో నటిస్తే రికార్డుల మోత మోగాల్సిందే?