మరికొందరివి చాలా సున్నితంగా ఉంటాయి.అయితే మిగిలిన చర్మ తత్వాలతో పోలిస్తే సున్నితమైన చర్మ తత్వం ఉన్న వారు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్న చర్మం పొడిబారిపోవడం, మొటిమలు, మచ్చలు, దురద, ఎర్రగా కందిపోవడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
మరి లేటెందుకు సున్నితమైన చర్మం ఉన్న వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూసేయండి.
చాలా మంది వేడి వేడి నీటితో స్నానం చేయడమంటే తెగ ఇష్టపడుతుంటారు.కానీ, సున్నితమైన చర్మం ఉన్న వారు హాట్ హాట్ వాటర్‌తో బాత్ చేస్తే.
క్రమంగా చర్మం ఆరోగ్యం దెబ్బ తింటుంది.అందుకే గోరు వెచ్చని నీటితోనే స్నానం చేయాలి.
కఠినంగా ఉండే సబ్బులను ఎవైడ్ చేయాలి.మరియు కెమికల్స్ తక్కువగా ఉండే క్రీములు, మాయిశ్చరైజర్లు, లోషన్లు మాత్రమే చర్మానికి ఉపయోగించాలి.
సెన్సిటివ్ స్కిన్ ఉన్న వారు కాఫీ, టీ, కూల్డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
ఎందుకంటే, వీటిల్లో కెఫిన్ అధికంగా ఉంటుంది.ఇది సున్నితమైన చర్మాన్ని వేగంగా పొడిబారేలా చేస్తుంది.
"""/" /
అలాగే సున్నితమైన చర్మ తత్వం ఉన్న వారు డైట్‌లో క్యారెట్, బీట్‌రూట్, పాలకూర, పొద్దుతిరుగుడు గింజలు, చేపలు, వాల్ నట్స్, బాదం, బొప్పాయి, అవకాడో వంటి ఆహారాలను తరచూ తీసుకోవాలి.
తద్వారా వాటిలో ఉండే విటమిన్ ఇ, విటమిన్ సి, విటమిన్ బి, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మానికి రక్షణ కవచంలా ఏర్పడి.