వింటర్‌లో వెయిట్ లాస్‌కు ఉపయోగపడే బెస్ట్ సూప్స్ ఇవే..!
TeluguStop.com

ప్రస్తుతం వింటర్ సీజన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ సీజన్‌లో చలి పులి కారణంగా చాలా మంది వ్యాయామాలను, డైట్‌ను నిర్లక్ష్యం చేస్తుంటారు.


ఫలితంగా శరీరం బరువు పెరిగి పోతుంటుంది.అయితే ఇప్పుడు చెప్పబోయే సూప్స్‌ను డైట్‌లో చేర్చు కుంటే గనుక.


పెరిగిన బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం వింటర్‌లో వెయిట్ లాస్‌కు ఉపయోగపడే సూప్స్ ఏంటో ఓ చూపు చూసేయండి.
"""/" /
వింటర్ సీజన్‌లో తీసుకోవాల్సిన బెస్ట్ సూప్స్‌లో క్యాబేజీ సూప్ ముందు వరసలో నిలుస్తుంది.
క్యాబేజీ సూప్‌ను తరచూ తీసుకుంటూ ఉంటే.అందులోని పొటాషియం కంటెంట్ మెటబాలిజం రేటును పెంచుతుంది.
మెటబాలిజం రేటు పెరిగితే.శరీరంలో కేలరీలు త్వరగా కరిగి పోతాయి.
మరియు క్యాబేజీ సూప్‌ను డైట్‌లో చేర్చు కోవడం వల్ల ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావన కలుగుతుంది.
దాంతో చిరు తిండ్లపై మనసు మల్లకుండా ఉంటుంది.ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.
అలాగే వింటర్‌లో వెయిట్ లాస్‌కు ఉపయోగపడే సూప్స్‌లో శనగల సూప్ ఒకటి.శనగలతో తయారు చేసుకున్న సూప్ ను తీసుకుంటే గనుక.
అందులో అధికంగా ఉండే ప్రోటీన్ మరియు ఫైబర్‌లు శరీర బరువు నియంత్రణలోకి తెస్తాయి.
పైగా ఈ సీజన్‌లో శనగల సూప్‌ను తీసుకుంటే చలిని తట్టుకునే శక్తి లభిస్తుంది.
బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.గుండె ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది.
"""/" /
ఇక చలి కాలంలో బాడీ వెయిట్‌ను తగ్గించేందుకు టమాటా సూప్ కూడా ఎంతగానో సహాయ పడుతుంది.
తరచూ టమాటా సూప్‌ను సేవిస్తే శరీరంలో పేరుకు పోయిన కొవ్వు కరిగి బరువు తగ్గుతారు.
అదే సమయంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.తద్వరా సీజనల్ వ్యాధులు వచ్చే రిస్క్ తగ్గు ముఖం పడుతుంది.
అమెరికా డ్రీమ్ అట్టర్ ఫ్లాప్.. రూ.40 లక్షల అప్పు.. ఇండియాలో రూ.9 వేలతో బతుకు పోరాటం!