రోజు ఉదయం అరటి పండును ఇలా తీసుకుంటే మీ బాన పొట్ట నెల రోజుల్లో మాయమవుతుంది!
TeluguStop.com
ఇటీవల కాలంలో చాలా మంది బెల్లీ ఫ్యాట్ సమస్య( Belly Fat Problem )తో బాధపడుతున్నారు.
ఈ క్రమంలోనే బాన పొట్టను కరిగించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.
? అయితే మీకు అరటి పండ్లు( Bananas ) బాగా సహాయపడతాయి.చాలా మంది అరటిపండు తింటే బరువు పెరుగుతారని భావిస్తుంటారు.
కానీ అది కేవలం అపోహ మాత్రమే.అరటి పండులో పోషకాలు మెండుగా ఉంటాయి.
మితంగా తీసుకుంటే అరటిపండు వల్ల బరువు పెరగడం కాదు తగ్గుతారు.మరి అరటిపండుతో బాన పొట్టను ఎలా కట్ చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
"""/" /
ముందుగా ఒక అరటి పండు( Bananas )ను తీసుకొని తొక్క తొలగించి స్లైసెస్ గా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న అరటిపండు ముక్కలు వేసుకోవాలి.
అలాగే ఒక కప్పు బ్లాక్ కాఫీ వేసుకోవాలి.అరటిపండు తర్వాత మెయిన్ ఇంగ్రిడియంట్ బ్లాక్ కాఫీనే.
వీటితో పాటు వన్ టేబుల్ స్పూన్ పెరుగు,( Curd ) హాఫ్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్, రెండు టేబుల్ స్పూన్ల తేనె ( Honey )వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
"""/" /
తద్వారా ఓ అద్భుతమైన ఫ్యాట్ కట్టర్ స్మూతీ సిద్ధం అవుతుంది.
రోజు ఉదయం ఈ స్మూతీని తీసుకుంటే పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరుగుతుంది.
బాన పొట్ట కొద్ది రోజుల్లోనే నాజూగ్గా మారుతుంది.కాబట్టి బాన పొట్టతో బాధపడుతున్న వారు ఈ ఫ్యాట్ కట్టర్ స్మూతీని తప్పకుండా డైట్ లో చేర్చుకోండి.
అలాగే ఈ స్మూతీ వెయిట్ లాస్ కు కూడా సహాయపడుతుంది.ఉదయం ఈ స్మూతీని తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది.
దాంతో చిరుతిళ్లపై మనసు మళ్లకుండా ఉంటుంది.ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.
ఇక ఈ స్మూతీ నీరసం, అలసట వంటివి రాకుండా అడ్డుకుంటుంది.ఒత్తిడిని క్షణాల్లో దూరం చేస్తుంది.
మరియు మెదడు చురుగ్గా పనిచేసేలా ప్రోత్సహిస్తుంది.