కండరాల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీ డైట్ లో ఇది ఉండాల్సిందే!

కండరాల బలహీనత.మనలో చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.

పోషకాల కొరత, స్ట్రోక్, పోలియో, మద్యపానం, పలు రకాల మందుల వాడకం, డిప్రెషన్ తదితర కారణాల వల్ల కండరాల బలహీనత ఏర్పడుతుంది.

దీని కారణంగా ఏ పని చేయలేకపోతుంటారు.నిలబడడానికి కూడా కష్టంగా మారుతుంది.

ఏదైనా వస్తువును పట్టుకుందాం అన్న శరీరం సహకరించదు.దాంతో ఈ సమస్య నుంచి బయటపడడం కోసం మందులు వాడుతుంటారు.

మీరు ఈ లిస్ట్ లో ఉన్నారా.? అయితే వెంటనే మీ డైట్ లో ఇప్పుడు చెప్పబోయే స్మూతీని చేర్చుకోవాల్సిందే.

ఈ స్మూతీ బలహీనమైన కండరాలను(muscle) బలంగా మార్చడానికి ఎంతగానో సహాయపడుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వేసి వాటర్ పోసి నానబెట్టుకోవాలి.

ఆ తర్వాత ఒక అరటి పండును(Banana) తీసుకొని పీల్ తొలగించి స్లైసెస్ గా కట్ చేసుకోవాలి.

"""/" / ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్‌ చేసి పట్టుకున్న అరటి పండు ముక్కలు, నాలుగు నుంచి ఐదు పాలకూర ఆకులు, ఆరు టేబుల్ స్పూన్లు పెరుగు, నానబెట్టుకున్న చియా సీడ్స్, అరకప్పు బ్లాక్ గ్రేప్స్ వేసుకుని కొద్దిగా వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

తద్వారా మన స్మూతీ ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు తేనెను కలుపుకొని తీసుకోవాలి.

రోజుకి ఒక్కసారి ఈ బనానా పాలక్ స్మూతీ(banana Palak Smoothie)ని తీసుకుంటే కండరాల బలహీనత కొద్ది రోజుల్లోనే దూరం అవుతుంది.

కండరాలు బలంగా మరియు దృఢంగా మారతాయి.కాబట్టి ఎవరైతే కండరాల బలహీనతతో బాధపడుతున్నారో వారు తప్పకుండా ఈ స్మూతీని డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.

కండలు పెంచడానికి ట్రై చేస్తున్న వారు కూడా ఈ స్మూతీని తీసుకోవచ్చు.

వీర్రాజు కు ఆ పదవి.. ? విష్ణుకూ ఛాన్స్ ?