కంటి చూపు రోజురోజుకు తగ్గుతుందా.. లేట్ వద్దు వెంటనే ఇలా చేయండి!

ప్రస్తుత రోజుల్లో చాలా మందికి చిన్న వయసులోనే కంటి ( Eye Sight ) చూపు మందగిస్తుంది.

మొబైల్ ఫోన్ ను అధికంగా వినియోగించడం, ల్యాప్ టాప్ ముందు గంటల తరబడి కూర్చుని గేమ్స్ ఆడటం, పోషకాల కొరత, ఒత్తిడి తదితర కారణాల వల్ల కంటి చూపు అనేది తగ్గుతుంటుంది.

దీంతో కళ్ళద్దాలపై ఆధారపడుతుంటారు.ఈ జాబితాలో పదేళ్ల వయసు వారు సైతం ఉంటున్నారు.

అయితే కంటి చూపు తగ్గడాన్ని ముందే గ్రహించి పలు జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు కళ్ళద్దాల అవసరం ఉండదు.

మీకు కూడా కంటి చూపు రోజురోజుకు తగ్గుతున్నట్లు అనిపిస్తుందా.? అయితే అస్సలు లేటు వద్దు.

వెంటనే ఇప్పుడు చెప్పబోయే స్మూతీని( Smoothie ) డైట్‌ లో చేర్చుకోండి.ఈ స్మూతీ కంటి చూపును పెంచ‌డానికి అద్భుతంగా సహాయపడుతుంది.

అందుకోసం ముందుగా ఒక బీట్ రూట్( Beet Root ) తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న బీట్ రూట్ ముక్కలు మరియు అరకప్పు రాస్ప్బెర్రీస్( Raspberries ) వేసుకోవాలి.

అలాగే ఒక గ్లాస్ హోమ్ మేడ్ బాదం పాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

"""/" / తద్వారా మన స్మూతీ సిద్ధం అవుతుంది.ఈ స్మూతీలో వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్‌( Chia Seeds ) వేసి తీసుకోవాలి.

రోజు ఈ బీట్ రూట్ స్మూతీని తీసుకుంటే కంటి చూపు తగ్గడం కాదు పెరుగుతుంది.

ఈ స్మూతీ ద్వారా కంటి ఆరోగ్యానికి అవసరమయ్యే విటమిన్ ఎ తో పాటు అనేక పోషకాలు లభిస్తాయి.

దాంతో కంటి చూపు మెరుగ్గా మారుతుంది. """/" / ఇక ఈ స్మూతీ తో పాటు ఆకుకూరలు, చేపలు, నట్స్, క్యారెట్, స్వీట్ పొటాటో, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, సిట్రస్ పండ్లు వంటివి డైట్ లో ఉండేలా చూసుకోవాలి.

ఇవి కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.కంటి చూపును పెంచుతాయి.

కంటి చూపు రోజు రోజుకు తగ్గుతుంద‌ని భావిస్తున్న వారు మొబైల్, ల్యాప్ టాప్‌ వాడకం తగ్గించుకోండి.

అలాగే నిత్యం అరగంట పాటు ధ్యానం లేదా వ్యాయామం వంటివి చేయండి.కంటినిండా నిద్ర ఉండేలా కూడా చూసుకోండి.

ఎన్టీఆర్ ను ఇక మీదట ఆపేవారు ఎవరు లేరా..?