హెల్తీగా వెయిట్ గెయిన్ అవ్వాలా? అయితే దీన్ని తీసుకోండి!

సాధారణంగా బరువు తగ్గడం చాలా కష్టమని భావిస్తుంటారు.కానీ పెరగడం కూడా కష్టమే.

ప్రస్తుత రోజుల్లో బ‌రువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారి సంఖ్య లెక్కకు మిక్కిలిగా ఉంది.

అలాగే కొందరు బరువు పెరగడానికి కూడా ప్రయత్నిస్తుంటారు.వయసుకు తగ్గ బరువు లేకపోవడం వల్ల ఎన్నో సమస్యలు వస్తుంటాయి.

చూపరులకు కూడా అంత ఆకర్షణీయంగా కనిపించలేకపోతుంటారు.ఈ క్రమంలోనే బరువు పెరగడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.

అయితే బరువు పెరగడం ఎంత ముఖ్యమో ఆరోగ్యంగా పెరగడం కూడా అంతే ముఖ్యం.

బరువు పెరగడం కోసం ఏది పడితే అది తినడం మానేసి.ఇప్పుడు చెప్పబోయే స్మూతీని కనుక డైట్ లో చేర్చుకుంటే వేగంగా మరియు ఆరోగ్యంగా బరువు పెరుగుతారు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.

ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్‌ తీసుకొని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్‌ మరియు వాటర్ పోసి నానబెట్టుకోవాలి.

అలాగే మరో గిన్నెలో ఎనిమిది బాదం పప్పులు వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

ఇక చివరిగా మరొక గిన్నెలో రెండు ఎండిన అత్తి పండ్లు, మూడు ఎండిన ఆప్రికాట్లు వేసుకుని వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు ఉదయాన్నే ఒక అరటి పండును తీసుకొని తొక్క తొలగించే సన్నగా స్లైసెస్ గా కట్ చేసుకోవాలి.

"""/"/ అలాగే సపోటా పండును కూడా తీసుకుని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేయాలి.

ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో సపోటా పండు ముక్కలు, అరటిపండు ముక్కలు, నానబెట్టుకున్న అత్తిపండ్లు, ఆప్రికాట్స్‌, నానబెట్టి పొట్టు తొలగించిన బాదం పప్పు, ఒక గ్లాసు కాచి చల్లార్చిన పాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో నానబెట్టుకున్న చియా సీడ్స్‌ను మిక్స్ చేస్తే మన టేస్టీ అండ్ హెల్తీ స్మూతీ సిద్ధం అవుతుంది.

ఈ స్మూతీని బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకోవాలి.ప్రతిరోజు ఈ స్మూతీని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా బరువు పెరుగుతారు.

అలాగే ఎముకలు కండరాలు దృఢంగా మారతాయి.మరియు గుండె జబ్బులు వచ్చే రిస్క్ సైతం తగ్గుతుంది.

మొదలైన వరలక్ష్మి పెళ్లి సందడి.. వైరల్ అవుతున్న ప్రీ వెడ్డింగ్ ఫోటోస్!