ఈ హెయిర్ స్క్ర‌బ్‌ను వాడితే జుట్టు ఊడ‌నే ఊడ‌దు.. తెలుసా?

హెయిర్ ఫాల్.ఎంద‌రినో వేధించే జుట్టు స‌మ‌స్య‌ల్లో ఇదే ముందు వ‌ర‌స‌లో ఉంటుంది.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది మంది హెయిర్ ఫాల్ స‌మ‌స్య‌తో తీవ్రంగా స‌త‌మతం అవుతున్నారు.ఈ క్రమంలోనే జుట్టు రాల‌డాన్ని అరిక‌ట్ట‌డం కోసం విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

వైద్యుల స‌ల‌హా మేర‌కు కొంద‌రు ముందులు కూడా వాడుతుంటారు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే హెయిర్ స్క్ర‌బ్‌ను వాడితే గ‌నుక.

జుట్టు ఊడ‌నే ఊడ‌దు.మ‌రి ఇంకెందుకు లేటు ఆ హెయిర్ స్క్ర‌బ్ ఏంటో.

దాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో.మ‌రియు ఏ విధంగా వాడాలో.

ఓ చూపు చూసేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగ‌ర్‌, రెండు టేబుల్ స్పూన్ల ఇన్‌స్టెంట్ కాఫీ ఫౌడ‌ర్‌, రెండు టేబుల్ స్పూన్ల అలోవెర జెల్‌, వ‌న్ టేబుల్ స్పూన్ ల‌వంగాల‌ పొడి, రెండు టేబుల్ స్పూన్ల రెగ్యుల‌ర్ షాంపూ వేసుకుని అన్నీ క‌లిసేలా స్పూన్ సాయంతో మిక్స్ చేసుకుని ప‌క్క‌న పెట్టుకోవాలి.

ఇప్పుడు మ‌రో బౌల్ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేసి లైట్‌గా హీట్ చేయాలి.

వేడి చేసిన ఈ నూనెను జుట్టు మొత్తానికి ప‌ట్టించి కాసేపు మ‌సాజ్ చేసుకోవాలి.

ఆర గంట త‌ర్వాత ముందుగా త‌యారు చేసుకున్న హెయిర్ స్క్ర‌బ్ మిశ్ర‌మాన్ని త‌ల‌కు ప‌ట్టించాలి.

ఆపై వేళ్ల‌తో స్మూత్‌గా స్క్ర‌బ్ చేసుకుని ముప్పై నిమిషాల పాటు ష‌వ‌ర్ క్యాప్ పెట్టేసుకోవాలి.

"""/" / అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో హెయిర్ వాష్ చేసుకోవాలి.ఐదు రోజుల‌కు ఒక సారి ఈ హెయిర్ స్క్ర‌బ్‌ను ట్రై చేస్తే గ‌నుక‌ జుట్టు కుదుళ్లు బ‌లంగా మారి.

ఊడ‌టం త‌గ్గుతుంది.అలాగే ఈ హెయిర్ స్క్ర‌బ్ ను యూజ్ చేయ‌డం వ‌ల్ల ఆయిలీ హెయిర్‌, ఫ్రీజీ హెయిర్‌, హెయిర్ బ్రేకేజ్ వంటి స‌మ‌స్య‌ల నుంచి సైతం విముక్తి పొందొచ్చు.

 .