ఒక్క దెబ్బతో చుండ్రు మొత్తం పోవాలా.. అందుకు ఇదే బెస్ట్ రెమెడీ!
TeluguStop.com
ఆడ మగ అనే తేడా లేకుండా ఎంతో మందిని కామన్ గా ఇబ్బంది పెట్టే సమస్యల్లో చుండ్రు( Dandruff ) ఒకటి.
తలలో ఉండే చుండ్రు మన దుస్తులుపై రాలుతుంటే చాలా అసహ్యంగా అనిపిస్తుంది.అలాగే చుండ్రు కారణంగా తలలో విపరీతమైన దురద ఉంటుంది.
పైగా జుట్టు అధికంగా ఉండటానికి, డ్రై గా మారడానికి చుండ్రు కూడా ఒక కారణం.
అందుకే చుండ్రును ఎలాగైనా వదిలించుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే రెమెడీ ది బెస్ట్ వన్ గా చెప్పుకోవచ్చు.
ఈ రెమెడీని పాటిస్తే ఒక్క దెబ్బతో చుండ్రు మొత్తం పోతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
"""/"/
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు బియ్యం వేసుకోవాలి.
అలాగే మూడు బిర్యానీ ఆకులు తుంచి వేసుకోవాలి.చివరిగా వన్ టేబుల్ స్పూన్ డ్రై రోజ్ మేరీ ఆకులు వేసి కనీసం 15 నిమిషాల పాటు మరిగించాలి.
ఆపై మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసి చల్లారబెట్టుకోవాలి.ఈ లోపు ఒక ఉల్లిపాయ( Onion ) తీసుకుని సన్నగా తురిమి జ్యూస్ సపరేట్ చేసుకోవాలి.
ఈ జ్యూస్ లో ముందుగా తయారు చేసి పెట్టుకున్న వాటర్ మరియు వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut Oil ) వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే ఒక మంచి టోనర్ సిద్ధమవుతంది.
ఈ టోనర్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకొని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.
"""/"/
గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా సరే ఈ హోమ్ మేడ్ టోనర్( Homemade Toner ) ను కనుక వాడారంటే అద్భుత ఫలితాలు పొందుతారు.
ఈ టోనర్ చుండ్రుకు వ్యతిరేకంగా పోరాడుతుంది.చుండ్రును సమర్థవంతంగా పోగొడుతుంది.
కాబట్టి చుండ్రు సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ న్యాచురల్ టోనర్ ను ప్రయత్నించండి.
విధ్వంసం సృష్టించిన హార్థిక్.. ఒకే ఓవర్లు 29 పరుగులు