పిగ్మెంటేషన్‌ను వ‌దిలించుకోవాలా? ఈ రెండూ ట్రై చేస్తే సూప‌ర్ రిజ‌ల్ట్ మీసొంతం!

పిగ్మెంటేషన్‌ను వ‌దిలించుకోవాలా? ఈ రెండూ ట్రై చేస్తే సూప‌ర్ రిజ‌ల్ట్ మీసొంతం!

చ‌ర్మంపై నలుపు లేదా గోధుమ రంగులో ఏర్ప‌డే మ‌చ్చ‌ల‌నే పిగ్మెంటేషన్ అంటారు.వ‌య‌సు పైబ‌డిన వారిలో క‌నిపించే కామ‌న్ స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.

పిగ్మెంటేషన్‌ను వ‌దిలించుకోవాలా? ఈ రెండూ ట్రై చేస్తే సూప‌ర్ రిజ‌ల్ట్ మీసొంతం!

బుగ్గ‌లు, నుదురు, ముక్కు వంటి భాగాల్లో పిగ్నెంటేష‌న్ స‌మ‌స్య ఎక్కువగా ఉంటుంది.ఎంత తెల్ల‌గా ఉన్నా పిగ్నెంటేష‌న్ స‌మ‌స్య ఉంటే మాత్రం అందహీనంగానే క‌నిపిస్తారు.

పిగ్మెంటేషన్‌ను వ‌దిలించుకోవాలా? ఈ రెండూ ట్రై చేస్తే సూప‌ర్ రిజ‌ల్ట్ మీసొంతం!

అందు వ‌ల్ల‌నే పిగ్నెంటేష‌న్‌ను వ‌దిలించుకునేందుకు తెగ ప్ర‌య‌త్నిస్తుంటారు.కొంద‌రు ర‌క‌ర‌కాల ట్రీట్‌మెంట్స్ కూడా తీసుకుంటారు.

అయితే ఇంట్లోనే ఎటువంటి కెమిక‌ల్స్‌నూ యూజ్ చేయ‌కుండా న్యాచుర‌ల్‌గానే పిగ్నెంటేష‌న్ స‌మ‌స్య‌ను వ‌దిలించుకోవ‌చ్చు.

అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో అర‌ క‌ప్పు బొప్పాయి ముక్క‌లు, అర క‌ప్పు బంగాళ‌దుంప ముక్క‌లు తీసుకుని మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.

ఈ పేస్ట్ నుంచి జ్యూస్‌ను వేరు చేసి.అందులో రెండు స్పూన్ల‌ చంద‌నం పొడి, ఒక స్పూన్ పెరుగు, అర స్పూన్ కొబ్బ‌రి నూనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసుకుని.ఇర‌వై నిమిషాల అనంత‌రం వేళ్ల‌తో స్మూత్‌గా రుద్దుకుంటూ వాట‌ర్‌తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఈ ప్యాక్‌ను వారంలో రెండు సార్లు వేసుకోవాలి.ఇక ఈ ప్యాక్‌తో పాటు మీరు చేయాల్సిన మ‌రొక‌ ప‌ని ఏంటంటే.

ఒక బౌల్‌లో నాలుగు స్పూన్ల లెమ‌న్ జ్యూస్‌, నాలుగు స్పూన్ల రోజ్ వాట‌ర్‌, ఒక స్పూన్ గ్లిజ‌రిన్‌, ఒక స్పూన్ బాదం ఆయిల్ వేసుకుని అన్నీ క‌లిసేలా క‌లుపుకోవాలి.

"""/" / ఇప్పుడు దీనిని ఒక స్ప్రే బాటిల్‌లో నింపుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే వారం రోజులు ఉంటుంది.

దీనిని ప్ర‌తి రోజూ ఉద‌యం లేదా స‌యంత్రం స‌మ‌యంలో ముఖానికి స్ప్రే చేసుకుని బాగా ఆరిన త‌ర్వాత నార్మ‌ల్ వాట‌ర్‌తో శుభ్రం చేసుకోవాలి.

పైన చెప్పుకున్న ప్యాక్‌తో పాటు ఇలా కూడా చేస్తే పిగ్మెంటేషన్ స‌మ‌స్య సూప‌ర్ ఫాస్ట్‌గా దూరం అవుతుంది.