వారానికి ఒక్కసారి ఈ ప్రోటీన్ హెయిర్ ప్యాక్ ను వేసుకుంటే మీ జుట్టు రాలమన్నా రాలదు!

హెయిర్ ఫాల్( Hair Fall ) సమస్యతో బాగా సతమతం అవుతున్నారా.? ఎంత ప్రయత్నించినా జుట్టు రాలడం కంట్రోల్ అవ్వడం లేదా.

? హెయిర్ ఫాల్ కారణంగా మీ జుట్టు రోజురోజుకు పల్చగా మారుతుందా.? అయితే అసలు టెన్షన్ పడకండి.

జుట్టు అధికంగా రాలిపోతుంది అంటే ప్రోటీన్ కొరత కూడా అందుకు ఒక కారణం.

అందుకే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ను డైట్ లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతుంటారు.

అలాగే అప్పుడప్పుడు ప్రోటీన్ హెయిర్ ప్యాక్స్ కూడా వేసుకుంటూ ఉండాలి.తద్వారా జుట్టు రాలడం దెబ్బ‌కు కంట్రోల్ అవుతుంది.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ప్రోటీన్ హెయిర్ ప్యాక్( Protein Hair Pack ) ను వారానికి ఒక్కసారి కనుక వేసుకుంటే మీ జుట్టు రాలమన్నా రాలదు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ప్రోటీన్ హెయిర్ ప్యాక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్న పదండి.

ముందుగా ఒక అవకాడోను( Avocado ) తీసుకుని వాట‌ర్ తో శుభ్రంగా కడిగి లోపల ఉండే పల్ప్ ను సపరేట్ చేసుకోవాలి.

"""/" / ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో అవకాడో పల్ప్ వేసుకోవాలి.

అలాగే అర‌ కప్పు ఫ్రెష్ కొబ్బరిపాలు( Coconut Milk ) వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్( Olive Oil ), వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

"""/" / వారానికి ఒక్కసారి ఈ ప్రోటీన్ హెయిర్ ప్యాక్ ను వేసుకుంటే జుట్టు కుదుళ్ళు దృఢంగా మారతాయి.

దాంతో జుట్టు రాలడం క్రమంగా కంట్రోల్ అవుతుంది.హెయిర్ ఫాల్ సమస్య నుంచి బయటపడటానికి ఈ రెమెడీ ఉత్తమమైనది.

ఇక ఈ రెమెడీని పాటిస్తే జుట్టు సూపర్ సిల్కీగా, షైనీ గా మెరుస్తుంది.

కురులు ఒత్తుగా, పొడుగ్గా సైతం పెరుగుతాయి.కాబట్టి హెయిర్ ఫాల్ సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వారు తప్పకుండా ఈ ప్రోటీన్ హెయిర్ ప్యాక్ ను ప్రయత్నించండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

విమర్శలపాలయినా .. జగన్ కు కలిసిరాబోతోందా ?