శాఖాహారుల‌కు పుష్క‌లంగా ప్రోటీన్లు అందించే బెస్ట్ ఫుడ్ ఇదే!

సాధార‌ణంగా నాన్ వెజ్‌టేరియ‌న్స్ అటు కాయ‌గూర‌లు, ఇటు మాంసాహారాలు రెండూ లాగిచేస్తారు.కానీ, వెజ్‌టేరియ‌న్స్ మాత్రం మాంసానికి, గుడ్ల‌కు దూరంగా ఉంటారు.

వాటిని అస్స‌లు ముట్ట‌నే ముట్ట‌రు.కేవ‌లం కాయ‌గూర‌లు మాత్ర‌మే తీసుకుంటుంటారు.

ఫ‌లితంగా, వారిలో ప్రోటీన్ మ‌రియు విట‌మిన్ల లోపం క‌నిపిస్తుంది.ముఖ్యంగా శాఖాహారుల్లో ప్రొటీన్ కొరత అత్య‌ధికంగా ఉంటుంది.

అయితే అలాంటి శాఖాహారుల‌కు పుష్క‌లంగా ప్రోటీన్లు అందాలంటే.ఖ‌చ్చితంగా కొన్ని ఆహార ప‌దార్థాలు డైట్‌లో చేర్చుకోవాల్సిందే.

మ‌రి అవేంటో లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.ప్రోటీన్లు పుష్క‌లంగా ఉండే ఆహారాల్లో బాదం ప‌ప్పు ఒక‌టి.

ప్ర‌తి రోజు నాన బెట్టిన బాదం ప‌ప్పుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావాల్సిన ప్రోటీన్ అంద‌డంతో పాటుగా.

శ‌రీరంలో అద‌న‌పు కొవ్వు క‌రుగుతుంది.మ‌ధుమేహం అదుపులో ఉంటుంది.

చ‌ర్మ ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది.ఇక పాలు మ‌రియు పాల ద్వారా త‌యార‌య్యే పెరుగు, పన్నీర్‌, చీజ్‌ మొదలైన వాటిని డైట్‌లో చేర్చుకుంటే.

శాఖాహారుల‌కు ప్రోటీన్లు పుష్క‌లంగా అందుతాయి.అలాగే శాఖాహారుల‌కు పుష్క‌లంగా ప్రోటీన్లు అందాలంటే.

అలసందలు, సొయా బీన్స్‌, సెన‌గ‌లు, కిడ్నీబీన్స్‌, ఉలవలు, రాగులు ఇలాంటివి అన్నీ తీసుకోవాలి.

ఆకుకూర‌ల ద్వారా శాఖాహారులు ప్రోటీన్లు పొందొచ్చు.పాల‌కూర‌, బ్రోకలి, తోట‌కూర వంటి ఆకుకూర‌ల్లో ప్రోటీన్లు పుష్క‌లంగా ఉంటాయి.

అందువ‌ల్ల‌, వీటికి వారానికి క‌నీసం రెండు సార్లు అయినా తీసుకోవాలి. """/"/ అలాగే పీనట్ బటర్‌లో ప్రోటీన్లు పుష్క‌లంగా ఉంటాయి.

కానీ, చాలా మంది పీనట్ బటర్‌ను తీసుకునేందుకు సంకోచిస్తుంటారు.ఎందుకంటే, పీన‌ట్ బ‌ట‌ర్ తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు పెరిగిపోతార‌ని మ‌రియు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని భ‌య‌ప‌డుతుంటారు.

కానీ, రోజుకు ఒక స్పూన్ చొ‌ప్పున పీన‌ట్ బ‌ట‌ర్ తీసుకుంటే.ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు.

పైగా శ‌రీరానికి కావాల్సిన ప్రోటీన్లు అందించ‌డంతో పాటు మ‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను చేకూర్చుతుంది.

వైరల్: సాక్స్‌లు లేకపోతే ఏం… ఇలా ఎపుడైనా ఆలోచించారా?