దేశభక్తిని తట్టిలేపే టాలీవుడ్ సినిమాలివే.. ఈ సినిమాలు చూస్తే మనస్సు ఉప్పొంగుతుందంటూ?

మన దేశ ప్రజలకు ప్రత్యేకమైన రోజులలో స్వాతంత్ర దినోత్సవం( Independence Day ) ఒకటి అనే సంగతి తెలిసిందే.

మన దేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతోంది.ఈ 76 సంవత్సరాలలో దేశభక్తిని చాటి చెప్పే ఎన్నో సినిమాలు వచ్చాయి.

ఈ సినిమాలు మనస్సు ఉప్పొంగే విధంగా ఉండటంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.దేశభక్తి సినిమాలలో మొదట అల్లూరి సీతారామరాజు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

మన్యం వీరుడు( Manyam Veerudu ) అల్లూరి కథతో ఈ మూవీ తెరకెక్కగా సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో ఈ సినిమా ఒకటిగా నిలిచింది.

కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఖడ్గం మూవీ( Khadgam Movie ) కూడా దేశభక్తిని చాటిచెప్పేలా ఉంటుంది.

ఈ సినిమాలోని పాటలు సైతం సక్సెస్ సాధించాయి.విక్టరీ వెంకటేశ్ హీరోగా రాఘవేంద్రరావు డైరెక్షన్ లో దేశభక్తి కథాంశంతో సుభాష్ చంద్రబోస్( Subhash Chandra Bose ) తెరకెక్కింది.

ఈ మూవీ కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదు. """/" / శంకర్ డైరెక్షన్ లో కమల్ హీరోగా తెరకెక్కిన భారతీయుడు సినిమా( Bharateeyudu Movie ) కూడా దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కింది.

మహాత్మ, సైరా నరసింహారెడ్డి సినిమాలు సైతం దేశభక్తి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కి ఆకట్టుకున్నాయి.

సర్దార్ పాపారాయుడు, ఘాజీ, మహాత్మ సినిమాలలో కూడా దేశభక్తితో తెరకెక్కింది.బొబ్బిలిపులి, సీతారామం సినిమాలు సైతం దేశభక్తి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కి ఆకట్టుకున్నాయి.

"""/" / నా దేశం, మేజర్ చంద్రకాంత్, మరో ప్రపంచం, ఠాగూర్, రాజన్న, మేజర్ సినిమాలలో సైతం దేశభక్తికి సంబంధించిన అంశాల ప్రస్తావన ఉంటుంది.

ఈ సినిమలలో మెజారిటీ సినిమాలు తెలుగు సినిమాలు కాగా ఈ సినిమాలకు ప్రేక్షకుల ప్రశంసలు దక్కాయి.

రాబోయే రోజుల్లో దేశభక్తి బ్యాక్ డ్రాప్ లో మరిన్ని సినిమాలు రావాలని ఆ సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

జక్కన్న మహేష్ కాంబో మూవీ ఫస్ట్ డే కలెక్షన్ల అంచనాలివే.. ఆ రేంజ్ లో వస్తాయా?