సిల్కీ హెయిర్ కోసం ఆరాటపడుతున్నారా? అయితే ఈ ప్యాక్ ట్రై చేయండి!
TeluguStop.com
సాధారణంగా చాలా మంది అమ్మాయిలు సిల్కీ హెయిర్ కోసం తెగ ఆరాటపడుతుంటారు.ఈ క్రమంలోనే సెలూన్‌లో జుట్టుకు ఏవేవో ట్రీట్‌మెంట్స్ చేయించుకుంటూ వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.
అయితే ఎలాంటి ఖర్చు లేకుండా న్యాచురల్ పద్ధతుల్లోనూ జుట్టును సిల్కీగా మార్చుకోవచ్చు.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ప్యాక్‌ను ట్రై చేస్తే గనుక చాలా అంటే చాలా సులభంగా సిల్కీ హెయిర్‌ను తమ సొంతం చేసుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెయిర్ ప్యాక్ ఏంటో తెలుసుకుందాం పదండీ.ముందుగా ఒక కప్పు కొబ్బరి ముక్కలను తీసుకుని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
ఈ పేస్ట్ నుంచి కొబ్బరి పాలను మాత్రం వేరు చేసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఓ గిన్నెలో బాగా పండిన అరటి పండును తీసుకుని స్పూన్ సాయంతో స్మాష్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఈ అరటి పండు పేస్ట్‌లో ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి పాలు, రెండు స్పూన్ల ఫ్లాక్స్ సీడ్స్ జెల్, రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
"""/"/
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ పెట్టేసుకోవాలి.
రెండు గంటల అనంతరం కెమికల్స్ తక్కువగా ఉండే షాంపూను యూజ్ చేసి గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయాలి.
ఐదు రోజులకు ఒక సారి ఈ ప్యాక్‌ను వేసుకుంటే గనుక.జుట్టు స్మూత్‌గా, సిల్కీగా తయారు అవుతుంది.
అంతే కాదు, ఈ ప్యాక్‌ను ట్రై చేయడం వల్ల హెయిర్ ఫాల్ సమస్య క్రమంగా తగ్గు ముఖం పడుతుంది.
చిట్లిన జుట్టు మళ్లీ మామూలు స్థితికి వస్తుంది.మరియు జుట్టు ఒత్తుగా సైతం పెరుగుతుంది.
కాబట్టి, తప్పకుండా ఈ హెయిర్ ప్యాక్‌ను వేసుకోవడానికి ప్రయత్నించండి.
మృదువైన మెరిసేటి అధరాల కోసం ఈ టిప్స్ ను తప్పకుండా ఫాలో అవ్వండి!