బాడీ మసాజ్‌కి ఏయే ఆయిల్స్ వాడితే మంచిదో తెలుసా?

బాడీ మ‌సాజ్‌.ఎన్నో స‌మ‌స్య‌ల‌కు ఒక అద్భుత‌మైన మెడిసిన్‌లా ప‌ని చేస్తుంది.

అందులో ఎటువంటి సందేహం లేదు.అందుకే ఇటీవ‌ల కాలంలో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఎంద‌రో మంది బాడీ మ‌సాజ్‌కి బాగా అల‌వాటు ప‌డుతున్నారు.

బాడీ మ‌సాజ్ చేయించుకోవ‌డం వ‌ల్ల బోలెడ‌న్ని ఆరోగ్య లాభాల‌ను పొందొచ్చు.అదే స‌మ‌యంలో అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దూరంగా ఉండొచ్చు.

అయితే బాడీ మ‌సాజ్‌కి ఏ ఆయిల్ ప‌డితే ఆ ఆయిల్‌ను వాడ‌కూడ‌దు.మ‌న శ‌రీర స్థితిని బ‌ట్టీ ఆయిల్‌ను వాడితే మంచిద‌ని అంటున్నారు.

మ‌రి బాడీ మసాజ్‌కి ఏయే ఆయిల్స్ వాడితే మంచిదో చూసేయండి. """/" / సాధార‌ణంగా కొంద‌రికి ఒక్కో స‌మ‌యంలో ఒళ్లు నొప్పులు తీవ్రంగా ఉంటాయి.

అలాంట‌ప్పుడు క్యాస్ట్రో ఆయిల్(ఆముదం)తో బాడీ మసాజ్ చేయించుకోవాలి.త‌ద్వారా ఆముదంలో ఉండే కొన్ని ప్ర‌త్యేకమైన పోష‌కాలు బాడీ పెయిన్స్‌ను త్వ‌ర‌గా త‌గ్గించేస్తాయి.

అలాగే త‌మ స్కిన్ సాఫ్ట్ అండ్ స్మూత్‌గా మారాలీ అని కోరుకునే వారికి సన్ ఫ్లవర్ ఆయిల్ బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్పుకోవ‌చ్చు.

అవును, సన్ ఫ్లవర్ ఆయిల్ తో బాడీ మ‌సాజ్ చేయించుకుంటే గ‌నుక బాడీ మృదువుగా, కోమ‌లంగా మారుతుంది.

శ‌రీరంపై ముడ‌తలు వ‌చ్చేస్తున్నాయి అని భ‌య ప‌డే వారు.కొబ్బ‌రి నూనెతో బాడీ మ‌సాజ్ చేయించుకోవాలి.

కొబ్బ‌రి నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని ముడతలు పడకుండా, సాగిపోకుండా కాపాడ‌తాయి.

బాడీ మ‌సాజ్‌కి నువ్వుల నూనెను కూడా వాడొచ్చు.నువ్వుల నూనెను వాడ‌టం వ‌ల్ల స్కిన్ టైట్‌గా, గ్లోగా మారుతుంది.

మ‌రియు కండ‌రాలు ఆరోగ్యంగా, దృఢ‌ప‌డ‌తాయి.ఒత్తిడి, ఆందోళ‌న వంటి మాన‌సిక స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.

"""/" / స్వీట్ ఆల్మండ్ ఆయిల్ నూ బాడీ మ‌సాజ్‌కి ఉప‌యోగించ‌వ‌చ్చు.స్వీట్ ఆల్మండ్ ఆయిల్‌తో మ‌సాజ్ చేసుకుంటే మనస్సు మరియు శరీరం ఉత్సాహంగా మార‌తాయి.

చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా, నిగారింపుగా ఉంటుంది.మ‌రియు రక్తప్రసరణ మెరుగ్గా మారుతుంది.

ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి