నైట్ క్రీమ్ బ‌దులు దీన్ని వాడితే మీ స్కిన్ అద్దంలా మెరిసిపోతుంది!

రాత్రి నిద్రించే ముందు నైట్ క్రీమ్ వాడే అల‌వాటు దాదాపు చాలా మందికి ఉంటుంది.

చ‌ర్మం ఆరోగ్య వంతంగా, అందంగా మెరిసిపోవ‌డానికి నైట్ క్రీమ్‌ను ఉప‌యోగిస్తుంటారు.అయితే మార్కెట్‌లో దొరికే నైట్ క్రీముల్లో ఎన్నో కెమిక‌ల్స్ నిండి ఉంటాయి.

అందుకే వాటి బ‌దులు ఇప్పుడు చెప్ప‌బోయే న్యాచుర‌ల్ క్రీమ్‌ను వాడితే స్కిన్ అద్ధంలా మెరిసి పోవ‌డం ఖాయం.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ న్యాచుర‌ల్ క్రీమ్ ఏంటో.? దాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో.

?తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా ఒక కప్పు గుమ్మ‌డి కాయ ముక్క‌ల‌ను తీసుకుని మిక్సీ జార్‌లో వేసి మెత్త‌టి పేస్ట్‌లా చేసుకోవాలి.

ఇప్పుడు ఈ గుమ్మ‌డి కాయ పేస్ట్ నుంచి ర‌సాన్ని వేరు చేసుకోవాలి.ఆ త‌ర్వాత స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని.

అందులో గుమ్మ‌డి కాయ ర‌సం పోయాలి.ఈ ర‌సం బాగా మ‌రిగినాక‌.

రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసి ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేయాలి """/" / ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని చ‌ల్లార బెట్టుకుని.

ఆపై అందులో వ‌న్ టేబుల్ స్పూన్ అలోవెర జెల్‌, వ‌న్ టేబుల్ స్పూన్ బాదం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకుంటే సూప‌ర్ న్యాచుర‌ల్ నైట్ క్రీమ్ సిద్ధ‌మైన‌ట్టే.

ఈ క్రీమ్‌ను ఒక‌ చిన్న బాక్స్‌లో నింపుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే వారం నుంచి ప‌ది రోజుల పాటు వాడుకోవ‌చ్చు.

ఇక ఈ క్రీమ్‌ను ఎలా యూజ్ చేయాలంటే.ముందుగా ముఖానికి ఉన్న మేక‌ప్ మొత్తాన్ని పూర్తిగా తొల‌గించి వాట‌ర్‌తో ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత త‌యారు చేసుకున్న క్రీమ్‌ను వేళ్ల‌తో తీసుకుని ఫేస్‌కి, నెక్‌కి అప్లై చేసి.

స్మూత్‌గా రెండు నిమిషాల పాటు మ‌సాజ్ చేసుకుని ప‌డుకోవాలి.ఇలా ప్ర‌తి రోజు చేస్తే స్కిన్ వైట్‌, బ్రైట్‌గా, స్మూత్‌గా మెరిపిపోతుంది.

మ‌రియు ముడ‌త‌లు, మ‌చ్చ‌లు వంటివి ఉన్నా త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

వీడియో వైరల్: ఈ కుక్క యాక్టింగ్ ముందర ఆస్కార్ కూడా వేస్టేనేమో..