వింట‌ర్‌లో వాడాల్సిన బెస్ట్ న్యాచుర‌ల్ మాయిశ్చ‌రైజ‌ర్ ఇదే!

వింట‌ర్‌లో వాడాల్సిన బెస్ట్ న్యాచుర‌ల్ మాయిశ్చ‌రైజ‌ర్ ఇదే!

ప్ర‌స్తుతం వింట‌ర్ సీజ‌న్ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.ఈ సీజ‌న్‌లో దాదాపు అంద‌రి చ‌ర్మ‌మూ పొడి బారిపోతుంటుంది.

వింట‌ర్‌లో వాడాల్సిన బెస్ట్ న్యాచుర‌ల్ మాయిశ్చ‌రైజ‌ర్ ఇదే!

దీంతో మార్కెట్‌లో దొరికే ర‌క‌ర‌కాల మాయిశ్చ‌రైజ‌ర్ల‌ను కొనుగోలు చేసి వాడుతుంటారు.కానీ, ఆ మాయిశ్చ‌రైజ‌ర్లు చ‌ర్మాన్ని ఎక్కువ స‌మ‌యం పాటు తేమగా ఉంచ‌లేవు.

వింట‌ర్‌లో వాడాల్సిన బెస్ట్ న్యాచుర‌ల్ మాయిశ్చ‌రైజ‌ర్ ఇదే!

అందుకే న్యాచుర‌ల్ మాయిశ్చ‌రైజ‌ర్స్‌నే వాడాల‌ని నిపుణులు చెబుతుంటారు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే బెస్ట్ అండ్ న్యాచుర‌ల్ మాయిశ్చ‌రైజ‌ర్‌ను యూజ్ చేస్తే గ‌నుక ఎక్కువ స‌మ‌యం పాటు చ‌ర్మాన్ని తేమ‌గా, మృదువుగా మ‌రియు కోమలంగా ఉంచుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ మాయిశ్చ‌రైజ‌ర్ ఏంటీ.? దాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.

? ఏ విధంగా వాడాలి.? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల జోజోబా ఆయిల్‌, రెండు స్పూన్ల బీస్‌వ్యాక్స్‌, ఒక స్పూన్ విట‌మిన్ ఇ ఆయిల్ వేసుకోవాలి.

ఇప్పుడు ఈ మూడిటిని డ‌బుల్ బాయిల‌ర్ ప‌ద్ధ‌తిలో రెండు లేదా మూడు నిమిషాల పాటు తిప్పు కుంటూ హీట్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మంలో ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాట‌ర్‌, ఒక టేబుల్‌ స్పూన్ ఆలోవెర జెల్‌, నాలుగు చుక్క‌లు శాండల్ వుడ్ ఎసెన్షియల్ ఆయిల్, నాలుగు చుక్క‌లు రోజ్ ఎసెన్షియ‌ల్ ఆయిల్ వేసి అన్నీ క‌లిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

అంతే స‌హ‌జ సిద్ధ‌మైన మాయిశ్చ‌రైజ‌ర్ రెడీ. """/" / ఇప్పుడు గాలి చొర‌బ‌డ‌ని ఒక చిన్న డ‌బ్బాలో త‌యారు చేసుకున్న మాయిశ్చ‌రైజ‌ర్‌ను ఫిల్ చేసి ఫ్రిజ్‌లో పెట్టుకుంటే దాదాపు ప‌ది హేను, ఇర‌వై రోజుల వ‌ర‌కు నిల్వ ఉంటుంది.

ఈ న్యాచుర‌ల్ మాయిశ్చ‌రైజ‌ర్‌ను మీరు వాడే రెగ్యుల‌ర్ మాయిశ్చ‌రైజ‌ర్ మాదిరిగానే వాడుకోవ‌చ్చు.ఇక ఈ మాయిశ్చ‌రైజ‌ర్‌ను వాడ‌టం వ‌ల్ల స్కిన్ తేమ‌గా, మృదువుగా మార‌డ‌ట‌మే కాదు.

కాంతి వంతంగానూ మెరుస్తుంది.

ఆరు నెలలు గడిచినా ఇంకా కోలుకోలేదు.. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

ఆరు నెలలు గడిచినా ఇంకా కోలుకోలేదు.. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!