అందం, జుట్టు.. రెండూ పెర‌గ‌లా? అయితే ఈ జ్యూస్ మీకోస‌మే!

చ‌ర్మ సౌంద‌ర్యాన్ని, జుట్టును పెంచుకునేందుకు తాప‌త్రాయ‌ప‌డని వారుండ‌రు.ఆరోగ్యం కంటే ఎక్కువ శ్ర‌ద్ధ అందం, జుట్టుపైనే పెడుతుంటారు.

వేల‌కు వేలు ఖ‌ర్చు పెట్టి ఫేస్ క్రీములు, మాయిశ్చ‌రైజ‌ర్లు, లోష‌న్లు, సీర‌మ్‌లు, ఫేస్ మాస్క్‌లు, హెయిర్ ఆయిల్స్, షాంపూలు, కండిషనర్లు కొనుగోలు చేసి వాడుతుంటారు.

అయితే అందాన్ని, జుట్టును పెంచుకోవాలంటే పైపై పూత‌లే స‌రిపోవు.పోష‌కాలు మెండుగా ఉండే ఆహారాల‌ను కూడా డైట్‌లో చేర్చుకోవాలి.

ముఖ్యంగా ఇప్పుడు చెప్ప‌బోయే జ్యూస్‌ను త‌ర‌చూ తీసుకుంటే మీ అందం, జుట్టు.రెండూ పెరుగుతాయి.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఈ జ్యూస్ ఏంటీ.ఎలా త‌యారు చేసుకోవాలి.

అస‌లు ఆ జ్యూస్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఏయే బెనిఫిట్స్ పొందొచ్చు వంటి విష‌యాలపై ఓ లుక్కేసేయండి.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఐదు ఎండు ద్రాక్ష‌లు వేసి వాట‌ర్ పోసి ఎనిమిది గంట‌ల పాటు నాన‌బెట్టుకోవాలి.

ఆ త‌ర్వాత ఒక అర‌టి పండును తీసుకుని తొక్క తొల‌గింయి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

"""/"/ ఇప్పుడు బ్లెండ‌ర్‌లో క‌ట్ చేసుకున్న అర‌టి పండు ముక్క‌లు, నాన‌బెట్టుకున్న ఎండు ద్రాక్ష‌లు, ఐదు గింజ తొల‌గించిన కీమా డేట్స్‌, ఒక క‌ప్పు కాచి చ‌ల్లార్చిన పాలు వేసి బ్లెండ్ చేసుకుంటే జ్యూస్ సిద్ధ‌మైన‌ట్టే.

ఇందులో షుగ‌ర్ గాని, తేనె గాని క‌ల‌ప‌కుండా డైరెక్ట్‌గానే సేవించాలి.ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ స‌మ‌యంలో ఈ జ్యూస్‌ను తీసుకోవాలి.

వారంలో మూడంటే మూడు రోజులు ఈ బ‌నానా డేట్ జ్యూస్‌ను తీసుకుంటే.చ‌ర్మం మునుప‌టి కంటే య‌వ్వ‌నంగా, కాంతి వంతంగా మారుతుంది.

స్కిన్ టోన్ మెరుగు ప‌డుతుంది.ముఖంపై మొటిమ‌లు రాకుండా ఉంటాయి.

అలాగే జుట్టు కుదుళ్ల‌కు బ‌లం చేకూరి ఊడ‌టం త‌గ్గుతుంది.కేశాలు ఒత్తుగా, పొడ‌వుగా పెరుగుతాయి.

కాబ‌ట్టి, ఖ‌చ్చితంగా పైన చెప్పిన బ‌నానా డేట్ జ్యూస్‌ను డైట్‌లో చేర్చుకోండి.

ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సాధించినందుకు సాయిపల్లవికి సన్మానం.. ఈ హీరోయిన్ గ్రేట్ అంటూ?