ఇన్‌స్టెంట్ ఎనర్జీని అందించే అద్భుతమైన జ్యూసులు ఇవే!
TeluguStop.com
మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి కూడా వేగాన్ని పెంచి తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు.
ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు, మరెన్నో ఒడిదొడుకులు.ఈ క్రమంలోనే ఒంట్లో ఉండే శక్తినంతా కోల్పోతుంటారు.
అయితే అలాంటి సమయాల్లో ఇప్పుడు చెప్పబోయే జ్యూసులు తీసుకుంటే గనుక ఇన్‌స్టెంట్ ఎనర్జీని పొందొచ్చు.
మరి ఏ మాత్రం లేట్ చేయకుండా తక్షణ శక్తిని అందించే ఆ జ్యూసులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
"""/" /
పుచ్చకాయ జ్యూస్ రుచిగా ఉండటమే కాదు ఇన్‌స్టెంట్ ఎనర్జీని అందించి శరీరాన్ని యాక్టివ్‌గా మార్చేస్తుంది.
పైగా పుచ్చకాయ జ్యూస్ తీసుకుంటే శరీరం హైడ్రేటెడ్‌గా మారుతుంది.మరియు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి.
మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.అలాగే నీరసం, అలసట వంటి సమస్యలతో బాధ పడుతున్నప్పుడు టమాటో జ్యూస్ తాగారంటే వెంటనే శక్తివంతంగా మారతారు.
టమాటో జ్యూస్‌లో ఉండే కొన్ని పోషక విలువల నీరసం, అలసట వంటి సమస్యలను ఇట్టే దూరం చేసి.
శరీరానికి బోలెడంత ఎనర్జీని అందిస్తుంది.కివి, స్ట్రాబెర్రీ పండ్లను విడి విడి గా కంటే కలిపి జ్యూస్ చేసుకుంటే శరీరం యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా మారుతుంది.
మరియు ఎన్నో పోషక విలువలు సైతం అందుతాయి.ఇన్‌స్టెంట్ ఎనర్జీని అందించడంలో జామ పండ్ల జ్యూస్ సైతం సహాయపడుతుంది.
ఈ జ్యూస్‌లో విటమిన్, మినరల్స్, ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి తక్షణమే శక్తిని అందిస్తాయి.
"""/" /
నారింజ జ్యూస్ కూడా బాడీకి ఇన్‌స్టెంట్‌గా శక్తిని అందించగలదు.నీరసం ఎక్కువగా ఉన్నప్పుడు ఒక గ్లాస్ నారింజ జ్యూస్ తాగాలంటే చాలా కొద్ది క్షణాల్లోనే శక్తి వంతంగా మారి పోతారు.
పైగా నారింజ జ్యూస్ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.ఒత్తిడి, తల నొప్పి, ఆందోళన వంటి మానసిక సమస్యలు సైతం తగ్గు ముఖం పడతాయి.