హనీమూన్ కోసం చల్లని ప్రాంతాలకు వెళ్లాలనుకుంటున్నారా? ఇవి ట్రై చేసి చూడండి!

హనీమూన్ అనగానే దాదాపుగా చాలా మంది చల్లని ప్రదేశాలకు వెళ్లాలని అనుకుంటూ వుంటారు.

ముఖ్యంగా ఈ సమ్మర్లో పెళ్లిళ్లు చేసుకున్నవారు అయితే ఖచ్చితంగా చల్లని ప్రదేశాలకే ఓటేస్తారు.

అయితే కొంతమంది బాగా డబ్బున్నవారు విదేశాలు వెళ్లాలని ప్లాన్ చేస్తే.ఎక్కువశాతం మంది మాత్రం మనదేశంలోనే కొన్ని ప్రాంతాలను ఎంచుకుంటూ వుంటారు.

అయితే అలాంటి ప్రదేశాల గురించి అందరికీ అవగాహన ఉండదు.మనదేశంలోనే వేసవిలో కూడా కాస్త చల్లదనం కలిగిన ప్రాంతాలు ఉన్నాయని మీకు తెలుసా? """/"/ మంచు కొండలు, సెలయేరులు, మంచు వర్షం వంటివి కురిసే కొన్ని ప్రాంతాలు వున్నాయి.

అక్కడికి వెళ్లారంటే మీకు భూతల స్వర్గం గుర్తుకు వస్తుంది.మొదటగా 'సిమ్లా-కుఫ్రి' ప్రాంతాన్ని తీసుకుంటే ఇది హిమాచల్ ప్రదేశ్ లో గలదు.

ఉత్తర భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ చెందిన సిమ్లా-కుఫ్రి ప్రాంతం కొత్తగా పెళ్ళైనవారికి బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు.

ఈ నగరం చుట్టూ కొండలు మంచుతో కప్పబడి ఉంటాయి.ఆ తరువాత "పహల్గాం, గుల్మార్గ్" గురించి వినే వుంటారు.

ఇక్కడ పైన్ చెట్లు మనుషులను ఆకర్షిస్తాయి.అంతేకాకుండా మంచుతో కప్పబడిన ఏటవాలు కొండలు ఇక్కడ దర్శనం మంచి అనుభవాన్ని మిగిల్చుతాయి.

"""/"/ ఆ తరువాత హిమాచల్ ప్రదేశ్ లో 'మనాలి' గురించి చెప్పుకోవాలి.మీరు హనీమూన్ కోసం ప్లాన్ చేస్తే ఇక్కడికి తప్పకుండా వెళ్ళండి.

హిల్ స్టేషన్, చుట్టూ మంచుతో కప్పబడిన శిఖరాలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. """/"/ ఇక "జులుక్, సిక్కిం" గురించి విన్నారా? సిక్కింలోని చిన్న ఓ గ్రామం ఇది.

అయితే ఇది చలికాలంలో సందర్శించడానికి ప్రసిద్ధి చెందిన ప్రదేశం అని చెప్పుకోవచ్చు."నైనిటాల్, ఉత్తరాఖండ్" ప్రదేశాన్ని కూడా మీ లిస్టులో చేర్చుకోవచ్చు.

అందమైన నైని సరస్సు ఇక్కడ కొలువు దీరింది.ఢిల్లీ నుంచి ఇది కొన్ని గంటల్లో ఇక్కడికి చేరుకోవచ్చు.

ఇక్కడికి ఏడాది పొడవునా సందర్శకులు వస్తుంటారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు రిజెక్ట్ చేసిన మూడు సినిమాలు ఆ స్టార్ పాలిట వరమయ్యాయా?