ఈ హోమ్ మేడ్ టోనర్ ను వాడితే మొటిమలు దరిదాపుల్లోకి కూడా రావు!

అత్యంత సర్వసాధారణంగా వేధించే చర్మ సమస్యల్లో మొటిమలు( Pimples ) ముందు వరుసలో ఉంటాయి.

ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, కంటి నిండా నిద్ర లేకపోవడం, హార్మోన్ చేంజ్, రసాయనాలు అధికంగా ఉండే మేకప్ ఉత్పత్తులను వాడటం, ఆయిలీ స్కిన్( Oily Skin ) తదితర కారణాల వల్ల చర్మం పై మొటిమలు ఏర్పడుతుంటాయి.

వాటి వల్ల చాలా మంది ఎంతగానో మదన పడుతుంటారు.మొటిమలను నివారించుకునేందుకు ముప్ప తిప్ప‌లు పడుతుంటారు.

మీరు ఈ లిస్టులో ఉన్నారా.? అయితే ఇకపై వర్రీ వద్దు.

ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ టోనర్ ను వాడితే మొటిమలు మీ దరిదాపుల్లోకి కూడా రావు.

మరి ఇంతకీ ఆ టోనర్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

"""/"/ ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు బియ్యం( Rice Water ) కడిగిన నీటిని వేసుకోవాలి.

అలాగే ఎనిమిది టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్ ను వేసుకుని కలుపుకోవాలి.ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ములేటి పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ నీమ్ పౌడర్, రెండు చుక్కలు టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

అంతే మన టోనర్ సిద్ధం అయినట్టే.ఒక స్ప్రే బాటిల్ తీసుకుని అందులో తయారు చేసుకున్న టోనర్ ను నింపుకోవాలి.

ఆ తర్వాత ముఖానికి ఏమైనా మేకప్ ఉంటే పూర్తిగా తొలగించి వాటర్ తో ఒకసారి వాష్ చేసుకోవాలి.

ఆపై తయారు చేసుకున్న టోనర్ ను ఫేస్ కి ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.

ఇర‌వై నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకుని.ఆపై వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.

"""/"/ ఈ హోమ్ మేడ్ టోనర్( Homemade Toner ) ను రెగ్యులర్ గా వాడితే మొటిమలు మీ దరిదాపుల్లోకి కూడా రావు.

చర్మంపై ఏమైనా మొటిమలు ఉన్నా సరే చాలా త్వరగా తగ్గుతాయి.మొటిమల తాలూకు మచ్చలు సైతం మాయమవుతాయి.

చర్మం ఆరోగ్యంగా, నిగారింపు గా మారుతుంది.కాబట్టి మొటిమలకు దూరంగా ఉండాలనుకునేవారు తప్పకుండా ఈ హోమ్ మేడ్ టోనర్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

వీడియో: చికెన్ సరిగా వండలేదని బిల్డింగ్ పైనుంచి భార్యని తోసేశాడు.. ఎక్కడంటే..??