బలహీనతను పోగొట్టే బెస్ట్ హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్.. ఈజీగా తయారు చేసుకోండిలా!

సాధారణంగా కొందరు శారీరకంగా చాలా బలహీనంగా ఉంటారు.ఏ పని చేయలేకపోతుంటారు.

ఎప్పుడు నీరసంగా కనిపిస్తుంటారు.అయితే అలాంటి వారిలో బలహీనతను పోగొట్టే బెస్ట్ హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ ఒకటి ఉంది.

నిత్యం ఈ పౌడర్ ను తీసుకుంటే ఎలాంటి బలహీనత అయినా సరే పరార్ అవుతుంది.

మరి ఇంతకీ ఆ ప్రోటీన్ పౌడర్( Protein Powder ) ను ఎలా తయారు చేసుకోవాలో ఓ చూపు చూసేయండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు బాదం పప్పు( Almonds ) వేసుకుని వేయించుకోవాలి.

ఆ తర్వాత అదే పాన్ లో ఒక కప్పు వేరు శనగలు( Peanuts ), అర కప్పు కాబోలి శనగలు, అర కప్పు పిస్తా పప్పు( Pista Nut ), అర కప్పు అవిసె గింజలు వేసుకుని విడివిడిగా వేయించుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, పిస్తా పప్పు, వేరుశనగలు, అవిసె గింజలు( Flax Seeds ) మరియు శనగలు వేసుకుని మెత్తని పౌడ‌ర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.

"""/" / ఇప్పుడు ఈ పొడిని ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

రోజు ఉదయం ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలు తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ తయారు చేసుకున్న ప్రోటీన్ పౌడర్ మరియు వన్ టేబుల్ స్పూన్ బెల్లం పొడి కలిపి తీసుకోవాలి.

నిత్యం ఈ ప్రోటీన్ పౌడర్ ను తీసుకున్నారంటే బలహీనత దూరం అవుతుంది.శారీరకంగా దృఢంగా మారతారు.

ఎముకలు, కండరాలు బలోపేతం అవుతాయి.నీరసం, అలసట వంటివి వేధించకుండా ఉంటాయి.

"""/" / అలాగే ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థ, జీవక్రియ మరియు మెదడు పనితీరును నిర్వహించడానికి ఈ ప్రోటీన్ పౌడర్ మద్దతు ఇస్తుంది.

తక్కువ బరువు ఉన్న వారికి కూడా ఈ ప్రోటీన్ పౌడర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

కాబట్టి బలహీనతను పోగొట్టి శక్తివంతంగా మారాలి అనుకునేవారు తప్పకుండా ఇంట్లోనే పైన చెప్పిన విధంగా ప్రోటీన్ పౌడర్ ను తయారు చేసుకుని నిత్యం వాడేందుకు ప్రయత్నించండి.

జూకీపర్‌పై మగసింహం అటాక్.. ఆడ సింహం ఎలా ఆపిందో చూడండి..