ఈ హెయిర్ మాస్క్ జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాదు కురులను సూపర్ సిల్కీగా మారుస్తుంది!
TeluguStop.com
థిక్ అండ్ సిల్కీ హెయిర్ కావాలని అందరూ కోరుకుంటారు.కానీ అటువంటి జుట్టు కేవలం కొందరికి మాత్రమే లభిస్తుంది.
మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటి.? అని అనుకోకండి.
ఎందుకంటే ఎవరైనా అటువంటి జుట్టును పొందొచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే హెయిర్ మాస్క్ అద్భుతంగా సహాయపడుతుంది.
ఈ హెయిర్ మాస్క్ ను వేసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గడమే కాదు కురులు సూపర్ సిల్కీ గా సైతం మారతాయి.
ఇంకెందుకు ఆలస్యం ఆ హెయిర్ మాస్క్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.
? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, రెండు టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్ వేసుకుని స్పూన్ తో రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా మిక్స్ చేయండి.
దాంతో అలోవెరా జెల్ స్మూత్ క్రీమ్ స్ట్రక్చర్ లోకి మారుతుంది.అప్పుడు అందులో నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ కోకోనట్ మిల్క్ వేసి మరోసారి అన్నీ కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంటన్నర లేదా రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెడ్ బాత్ చేయాలి.
"""/"/
రెండంటే రెండు సార్లు ఈ హెయిర్ మాస్క్ ను వేసుకుంటే జుట్టు రాలడం క్రమంగా తగ్గుముఖం పడుతుంది.
కురులు ఒత్తుగా మరియు సిల్కీ గా మారతాయి.డ్రై హెయిర్ అన్న మాటే అనరు.
జుట్టు ఎప్పుడూ పట్టుకుచ్చులా మెరుస్తుంది.కాబట్టి థిక్ అండ్ సిల్కీ హెయిర్ కోసం ఆరాటపడేవారు తప్పకుండా ఈ మాస్క్ ను వేసుకునేందుకు ప్రయత్నించండి.
మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.
ట్రంప్‌కు గట్టి షాక్ .. 80 ఏళ్ల అమెరికా చరిత్రలో తొలిసారి, దారుణంగా రేటింగ్