30 ఏళ్లకే తెల్ల జుట్టు రావడం స్టార్ట్ అయ్యిందా.. డోంట్ వర్రీ ఇలా చెక్ పెట్టండి!

వాతావరణంలో రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, ర‌సాయ‌నాలు అధికంగా ఉండే షాంపూల‌ను వినియోగించ‌డం తదితర కారణాల వల్ల ఇటీవల రోజుల్లో ఎంతో మంది చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య బారిన పడుతున్నారు.

ముఖ్యంగా ముప్పై ఏళ్లకే కొందరికి తెల్ల జుట్టు( White Hair ) రావడం స్టార్ట్ అవుతుంది.

ఆ తెల్ల జుట్టును కవర్ చేసుకునేందుకు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు.

మీరు కూడా ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.

తెల్ల జుట్టు రావడం స్టార్ట్ అయిన వెంటనే కొన్ని కొన్ని ఇంటి చిట్కాలను పాటించ‌డం ప్రారంభిస్తే ఆరంభంలోనే సమస్యకు చెక్ పెట్టవచ్చు.

ఈ నేపథ్యంలోనే తెల్ల జుట్టు సమస్యను పరిష్కరించే ఒక అద్భుతమైన రెమెడీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

"""/" / ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు హెన్నా పౌడర్( Henna Powder ) ను వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్( Coffee Powder ), రెండు టేబుల్ స్పూన్లు కోకోనట్ ఆయిల్ ( Coconut Oil )మరియు మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

"""/" / గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒకసారి ఈ విధంగా కనుక చేశారంటే తెల్ల జుట్టు క్రమంగా నల్లబడుతుంది.

తద్వారా ఆర్టిఫిషియల్ కలర్స్ పై ఆధార పడాల్సిన అవసరం ఉండదు.పైగా ఈ ఇంటి చిట్కాను పాటించడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.

జుట్టు ఒత్తుగా పెరగడం స్టార్ట్ అవుతుంది.అదే సమయంలో జుట్టు రాలడం విరగడం వంటి సమస్యలు త‌గ్గు పడతాయి.

చుండ్రు సమస్య నుండి సైతం విముక్తి పొందుతారు.

శేఖర్ కమ్ముల పరిచయం చేసిన హీరోల్లో ఈ ఒక్కడే రాణిస్తున్నాడా..?