జుట్టు ఎంత ప‌ల్చ‌గా ఉన్నా నెల రోజుల్లో ఒత్తుగా మార్చే రెమెడీ ఇదే!

సాధార‌ణంగా కొంద‌రి జుట్టు ఎంతో ఒత్తుగా ఉంటుంది.కానీ, కొంద‌రు జుట్టు మాత్రం చాలా అంటే చాలా ప‌ల్చ‌గా ఉంటుంది.

పోష‌కాల కొర‌త‌, వేడి వేడి నీటితో తలస్నానం చేయ‌డం, త‌డి జుట్టును దువ్వ‌డం, రెగ్యుల‌ర్‌గా హెయిర్ వాష్ చేసుకోవ‌డం, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే షాంపూల‌ను యూస్ చేయ‌డం, డ్రైయ్యర్స్ మ‌రియు హెయిర్ స్టైలింగ్ టూల్స్ ను అధికంగా వినియోగించ‌డం వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల జుట్టు ప‌ల్చ‌బ‌డి పోతుంది.

దాంతో పల్చగా ఉండే జుట్టును మెయింటైన్ చేయ‌లేక‌, మ‌ళ్లీ కురుల‌ను ఒత్తుగా మార్చుకోవ‌డం ఎలానో తెలియ‌క తెగ స‌త‌మ‌తం అయిపోతుంటారు.

మీరు కూడా పల్చ‌టి జుట్టుతో బాధ‌ప‌డుతున్నారా.? అయితే వ‌ర్రీ వ‌ద్దు.

ఇప్పుడు చెప్ప‌బోయే ప‌వ‌ర్ ఫుల్ రెమెడీని ట్రై చేస్తే నెల రోజుల్లో జుట్టు ఎంత ప‌ల్చ‌గా ఉన్నా ఒత్తుగా మారుతుంది.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాట‌ర్ పోయాలి.

వాట‌ర్ హీట్ అవ్వ‌గానే అందులో రెండు టేబుల్ స్పూన్ల బియ్యం వేసి ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.

ఇలా ఉడికించిన రైస్‌ను చ‌ల్లార‌బెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయిన వెంట‌నే రైస్‌ను వాట‌ర్‌తో స‌హా మిక్సీ జార్‌లో వేసి మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్ర‌మంలో రెండు ఎగ్ వైట్స్, వ‌న్ టేబుల్ స్పూన్ తేనె, వ‌న్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుని అన్నీ క‌లిసేంత వ‌ర‌కు మిక్స్ చేయాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు అప్లై చేసుకుని.

ష‌వ‌ర్ క్యాప్‌ను ధ‌రించాలి.గంట అనంత‌రం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

వారంలో రెండు సార్లు ఈ విధంగా హెయిర్ ప్యాక్‌ను వేసుకుంటే.ప‌ల్చ‌టి జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా పెరుగుతుంది.

బాబాయ్ పవన్ ఫోన్ నెంబర్ ను నిహారిక ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?