చిట్లిన జుట్టును రిపేర్ చేసే మినపప్పు.. ఎలాగో తెలుసా?
TeluguStop.com
సాధారణంగా కొందరి జుట్టు చివర్లు తరచూ చిట్లిపోతూ ఉంటుంది.హెయిర్ స్టైలింగ్ టూల్స్‌ను అధికంగా వాడటం, రోజూ తలస్నానం చేయడం, కాలుష్యం, ఆహారపు అలవాట్లు వంటి రకరకాల కారణాల వల్ల జుట్టు చిట్లిపోతూ ఉంటుంది.
ఈ చిట్లిన జుట్టును అలానే వదిలేస్తే హెయిర్ గ్రోత్ ఆగిపోతుంది.అందుకే చిట్లిన జుట్టును నివారించుకోవడం కోసం రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు.
ఎన్నెన్నో చిట్కాలను ప్రయత్నిస్తుంటారు.ఒకవేళ ఎన్ని చేసినా ఫలితం లేకుండా ఈ సమస్యను నివారించుకోవడం ఎలానో తెలియక మదన పడిపోతూ ఉంటాయి.
అయితే చిట్లిన జుట్టును రిపేర్ చేయడంలో మినపప్పు అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం జుట్టుకు మినపప్పును ఎలా యూస్ చేయాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల మినపప్పు, వన్ టేబుల్ స్పూన్ మెంతులు, వన్ టేబుల్ స్పూన్ బ్రౌన్ రైస్, ఒక కప్పు వాటర్ పోసి నాలుగు నుంచి ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టుకున్న మినపప్పు, మెంతులు, బ్రౌస్ రైస్ మరియు కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
"""/"/ ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, వన్ టేబుల్ స్పూన్ కొకనట్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి.
ఆపై ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి.షవర్ క్యాప్ పెట్టేసుకోవాలి.
రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూను యూజ్ చేసి గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి.
ఇలా నాలుగు రోజులకు ఒక సారి చేస్తే గనుక చిట్లిన జుట్టు మళ్లీ మామూలుగా మారుతుంది.
మరియు జుట్టు ఒత్తుగా, పొడవుగా కూడా పెరుగుతుంది.
ఒకే దారిలో నడుస్తున్న అల్లు అర్జున్, ఎన్టీఆర్.. ఇద్దరు హీరోలకు సక్సెస్ దక్కుతుందా?