ఖరీదైన క్రీములు అక్కర్లేదు.. ఇంట్లోనే పైసా ఖర్చు లేకుండా ముఖ చర్మాన్ని తెల్లగా మార్చుకోండిలా!

చాలా మంది తమ ముఖ చ‌ర్మం తెల్లగా మెరిసిపోతూ కనిపించాలని తెగ ఆరాట‌ప‌డుతుంటారు.

అందుకోసమే మార్కెట్లో లభ్యమయ్యే స్కిన్ వైట్నింగ్ క్రీమ్స్( Skin Whitening Creams ) ను కొనుగోలు చేసి వాడుతుంటారు.

వీటి కోసం ప్రతి నెల వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.కానీ ఇంట్లోనే పైసా ఖర్చు లేకుండా ముఖ చర్మాన్ని తెల్లగా మార్చుకోవచ్చు.

అందంగా మెరిపించుకోవ‌చ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి. """/" / మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు ఎండిన గులాబీ రేకులు మరియు ఒక కప్పు ఎండిన మందార పూలు( Hibiscus Flowers ) వేసుకుని మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఈ పౌడర్ ను ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ తయారు చేసి పెట్టుకున్న గులాబీ మందారం పొడిని వేసుకోవాలి.

"""/" / అలాగే వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ), హాఫ్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్‌ ఆయిల్( Almond Oil ) మరియు వన్ టేబుల్ స్పూన్ రోజ్‌ వాటర్ వేసుకుని అన్నీ కలిసేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి ఏదైనా బ్రష్ సహాయంతో పూత‌లా అప్లై చేసుకుని ఇర‌వై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

అనంతరం నార్మల్ వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి. """/" / ఆపై మంచి మాయిశ్చరైజ‌ర్ ను చర్మానికి అప్లై చేసుకోవాలి.

రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే చర్మం సహజంగానే తెల్లగా, కాంతివంతంగా మారుతుంది.

ఎలాంటి ఖరీదైన క్రీములు అక్కర్లేదు.సహజంగానే చర్మాన్ని తెల్లగా మార్చడానికి ఈ రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.

పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల చర్మంపై మొండి మచ్చలు ఏమైనా ఉంటే దూరం అవుతాయి.

మృత కణాలు తొలగిపోతాయి.చర్మం నిగారింపు గా మెరుస్తుంది.

అలాంటి విషయాలు బయటకు చెప్పను.. లావణ్యతో ప్రేమపై వరుణ్ రియాక్షన్ ఇదే!