Skin Whitening : ముఖం మెడ ఎంత నల్లగా ఉన్నా ఈ సింపుల్ రెమెడీతో వైట్ అండ్ బ్రైట్ గా మార్చుకోవచ్చు.. తెలుసా?

సాధారణంగా ఒక్కోసారి ముఖం మరియు మెడ నల్లగా తయారవుతుంటాయి.ఎండల్లో ఎక్కువగా తిరగడం, ఆహారపు అలవాట్లు, రసాయనాలు అధికంగా ఉండే స్కిన్ ప్రొడక్ట్స్ ను వాడటం, మేకప్ తో నిద్రించడం, డీహైడ్రేషన్( Dehydration ) తదితర కారణాల వల్ల స్కిన్ కలర్ తగ్గుతుంటుంది.

దాంతో తెగ హైరానా పడిపోతుంటారు.చర్మాన్ని ఎలా రిపేర్ చేసుకోవాలో తెలియక తోచిన చిట్కాలు పాటిస్తుంటారు.

వాటి వల్ల ఎలాంటి ఫలితం లేకుంటే మరింత ఆందోళనకు లోన‌వుతుంటారు. """/" / కానీ వర్రీ వద్దు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని కనుక పాటించారంటే ముఖం, మెడ ఎంత నల్లగా ఉన్న వైట్ అండ్ బ్రైట్ గా మారతాయి.

అందంగా మెరిసిపోతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బంగాళదుంప( Potato ) తీసుకుని తొక్క తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

అలాగే ఒక నిమ్మ పండును కూడా తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ లో బంగాళదుంప ముక్కలు మరియు నిమ్మ పండు ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

"""/" / ఆ త‌ర్వాత‌ ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ముల్తానీ మట్టి, వన్ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ పెరుగు ( Curd )మరియు సరిపడా పొటాటో అండ్ లెమన్ జ్యూస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై చర్మాన్ని సున్నితంగా రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఆపై చర్మానికి మంచి మాయిశ్చరైజర్ ను రాసుకోవాలి.రోజుకు ఒకసారి కనుక ఈ రెమెడీని పాటిస్తే అద్భుత ఫలితాలు పొందుతారు.

ఈ రెమెడీ చర్మం పై పేరుకుపోయిన మురికి మృత కణాలను తొలగిస్తుంది.టాన్ ను రిమూవ్ చేస్తుంది.

బంగాళదుంప నిమ్మలో ఉండే బ్లీచింగ్ ప్రాపర్టీస్ చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది.అలాగే చర్మాన్ని మృదువుగా మరియు కాంతివంతంగా మారుస్తాయి.

కాబట్టి సహజంగానే ముఖాన్ని మరియు మెడను వైట్ అండ్ బ్రైట్ గా మెరిపించుకోవాల‌నుకుంటే తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని ఫాలో అవ్వండి.

అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం వెనక ఎవరు ఉన్నారు…