పల్చటి జుట్టుతో మదన పడుతున్న పురుషులకు బెస్ట్ రెమెడీ ఇది.. తప్పక ట్రై చేయండి!

సాధారణంగా పురుషుల్లో చాలా మంది జుట్టు పల్చగా ఉంటుంది.గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవడం, ఒత్తిడి, కంటి నిండా నిద్ర లేకపోవడం, ఆహారపు అలవాట్లు, పోషకాలు కొరత, ధూమపానం మద్యపానం వంటి చెడు అలవాట్లు కారణంగా జుట్టు అధికంగా ఊడి పల్చగా తయారవుతుంది.

దీని కారణంగా ఏమాత్రం అట్రాక్టివ్ గా కనిపించలేరు.ఈ క్రమంలోనే జుట్టును ఒత్తుగా మార్చుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

మీరు కూడా ఈ జాబితాలో ఉన్నారా.? పల్చటి జుట్టుతో మదన పడుతున్నారా.

? అయితే ఇప్పుడు చెప్పబోయే రెమెడీ మీకు ది బెస్ట్ వన్ అని చెప్పుకోవచ్చు.

"""/" / ఈ రెమెడీని ప్రయత్నిస్తే కేవలం రెండు మూడు నెలల్లోనే మీ జుట్టు ఒత్తుగా మారుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు మునగాకు పొడి( Drumstick Powder ) వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు పొడి, వన్ టేబుల్ స్పూన్ మందారం పొడి( Hibiscus Powder ) వేసుకోవాలి.

ఆపై మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు, వన్ టేబుల్ స్పూన్ ఆముదం( Ricinus ) వేసుకుని బాగా మిక్స్ చేయాలి.

"""/" / ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే అద్భుత ఫలితాలు మీ సొంతం అవుతాయి.

మునగాకు, కరివేపాకు మరియు మందారం లో ఉండే పోషకాలు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.

జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తాయి.కురులను సూపర్ స్ట్రాంగ్ గా మారుస్తాయి.

ఈ రెమెడీని పాటించడం ద్వారా కొద్ది రోజుల్లోనే పల్చటి జుట్టు ఒత్తుగా మారుతుంది.

పైగా ఈ రెమెడీ జుట్టు త్వరగా తెల్లబడకుండా సైతం అడ్డుకుంటుంది.కాబట్టి ప‌ల్చ‌టి జుట్టుతో బాధ‌ప‌డుతున్న‌ పురుషులు తప్పకుండా ఈ రెమెడీని ప్రయత్నించండి.

1000 మంది స్టార్స్ కలిస్తే నా కొడుకు ప్రభాస్.. శ్యామలాదేవి కామెంట్స్ కు ఫిదా అవ్వాల్సిందే!