బెస్ట్ బాడీ వైట్నింగ్ రెమెడీ ఇది.. వారంలో ఒక్కసారి వాడిన సూపర్ రిజల్ట్ మీ సొంతం!
TeluguStop.com
ముఖంతో పాటు శరీరాన్ని కూడా తెల్లగా, అందంగా మెరిపించుకోవాలనే కోరిక మనలో చాలా మందికి ఉంటుంది.
అయితే ఎక్కువ శాతం మంది ముఖంపై పెట్టే శ్రద్ధ బాడీ పై పెట్టరు.
ఈ క్రమంలోనే శరీరంపై డెడ్ స్కిన్ సెల్స్( Dead Skin Cells ) పేరుకుపోయి స్క్రీన్ డల్ గా, డార్క్ గా మారుతుంటుంది.
మీ శరీరం కూడా ఇలాగే మారిందా.వర్రీ వద్దు ఇప్పుడు చెప్పబోయే బాడీ వైట్నింగ్( Body Whitening ) రెమెడీ మీకు గ్రేట్ గా సహాయపడుతుంది.
వారానికి ఒక్కసారి ట్రై చేసినా కూడా సూపర్ రిజల్ట్ మీ సొంతం అవుతుంది.
మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి అనేది తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక టమాటో ( Tomato ) తీసుకుని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేసి స్మూత్ ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు గోధుమపిండి,( Wheat Flour ) రెండు టేబుల్ స్పూన్లు ఓట్స్ పిండి,( Oats Flour ) రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి వేసుకుని నాలుగు కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
"""/" /
ఆ తర్వాత నాలుగు టేబుల్ స్పూన్లు పచ్చిపాలు( Raw Milk ) మరియు గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ వేసుకుని మరోసారి కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖం తో పాటు శరీరం మొత్తానికి అప్లై చేసుకోవాలి.
పది నిమిషాలు ఆరిన అనంతరం మెల్లగా స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా స్నానం చేయాలి.
"""/" /
ఈ రెమెడీ తర్వాత 12 గంటలు పాటు సూప్ అస్సలు వాడకూడదు.
ఈ సింపుల్ హోమ్ రెమెడీ మీ చర్మాన్ని వైట్ గా, బ్రైట్ గా మారుస్తుంది.
డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది.టాన్ ను రిమూవ్ చేస్తుంది.
స్కిన్ టోన్ ఇంప్రూవ్ చేస్తుంది.చర్మాన్ని మృదువుగా, కోమలంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.
బాడీ వైట్నింగ్ కోసం ప్రయత్నించే వారికి ఇది బెస్ట్ రెమెడీగా చెప్పుకోవచ్చు.
ఎన్టీఆర్ జాగ్రత్త పడితే అల్లు అర్జున్ బుక్కయ్యారా.. వివాదం విషయంలో ట్విస్టులివే!