చేతులపై ముడతలు అసహ్యంగా కనిపిస్తున్నాయా? అయితే ఈ టిప్స్ మీకోసమే!
TeluguStop.com
ఆహారపు అలవాట్లు, వయసు పైబడటం, పోషకాల కొరత, కాలుష్యం, కెమికల్స్ ఎక్కువగా స్కిన్ ప్రోడెక్ట్స్ వాడటం ఇలా రకరకాల కారణాల వల్ల ముఖంపై ముడతలు ఏర్పడుతూ ఉంటాయి.
అయితే కొందరికి చేతులు, కాళ్లపై సైతం ముడతలు వస్తాయి.ముఖ్యంగా చేతులపై వచ్చే ముడతలు చాలా అసహ్యంగా కనిపిస్తుంటాయి.
దాంతో వాటిని ఎలా నివారించుకోవాలో అర్థం గాక తెగ సతమతమవుతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ పాటిస్తే గనుక చాలా సులభంగా చేతులపై ఏర్పడిన ముడతలను నివారించుకోవచ్చు.
మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ టిప్స్ ఏంటో చూసేయండి.ముందుగా నాలుగు స్పూన్ల నువ్వులను తీసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ నువ్వుల పౌడర్‌లో రెండు స్పూన్ల పెరుగు, ఒక స్పూన్ గ్లిజరిన్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేతులకు అప్లై చేసుకుని.సర్కిలర్ మోషన్‌లో ఐదారు నిమిషాల పాటు స్మూత్‌గా మసాజ్ చేసుకోవాలి.
అనంతరం కాస్త డ్రై అవ్వనిచ్చి అప్పుడు గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఇలా ప్రతి రోజూ చేస్తే గనుక సాగిన చర్మం టైట్‌గా మారి ముడతలు తగ్గు ముఖం పడతాయి.
"""/" /
అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల పాల మీగడ, ఒక స్పూన్ తేనె, అర స్పూన్ గ్లిజరిన్, రెండు చుక్కలు లావెండర్ ఆయిల్ వేసుకుని కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేతులపై పూసి కాసేపు మసాజ్ చేసుకోవాలి.అపై గోరు వెచ్చని నీటితో చేతులను శుభ్రం చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల కూడా ముడతలు పోయి చేతులు అందంగా, మృదువుగా మారతాయి.
ఇక బౌల్‌లో మూడు స్పూన్ల క్యారెట్ జ్యూస్, ఒక స్పూన్ బాదం ఆయిల్ వేసి కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేతులకు అప్లై చేసి బాగా మసాజ్ చేసుకోవాలి.అనంతరం గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఇలా రోజూ చేసినా మంచి ఫలితం ఉంటుంది.
పహల్గామ్‌లో ఉగ్రదాడి.. ముగ్గురు తెలుగువారితో పాటు 30 మంది బలి!