తల దురదతో విసిగిపోతున్నారా? అయితే ఈ టిప్స్ మీకోసమే!
TeluguStop.com
తల దురద( Itchy Head ).చిన్న సమస్య అయినప్పటికీ తీవ్రమైన అసౌకర్యానికి గురి చేస్తుంది.
తల దురద కు కారణాలు అనేకం.చుండ్రు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, తగినంత తేమ లేకపోవడం, సరిగ్గా తల స్నానం చేయకపోవడం తదితర కారణాల వల్ల తల దురద వస్తుంటుంది.
దీనివల్ల ఎప్పుడు చూసినా చేతులు తలలోకి వెళ్తుంటాయి.ఈ సమస్య తీవ్రమైతే జుట్టు పటుత్వం కోల్పోయి రాలిపోయే ప్రమాదం ఉంటుంది.
అలాగే తల దురద కారణంగా చేసే పనిపై కూడా ఏకాగ్రత దెబ్బతింటుంది.కాబట్టి మొదట్లోనే ఈ సమస్యకు ఫుల్‌స్టాప్ పెట్టాలి.
అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే టిప్స్ చాలా ఉత్తమంగా సహాయపడతాయి.ఈ టిప్స్ తో సులభంగా తల దురదను వదిలించుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం పదండి. """/" /
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు పింక్ సాల్ట్ ( Pink Salt )వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్( Apple Cider Vinegar ) వేసి రెండు కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ కు అప్లై చేసి వేళ్ళతో సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి.
కనీసం ఐదు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకుని ఓ గంట పాటు అలా వదిలేయాలి.
అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.ఇలా చేస్తే ఇన్ఫెక్షన్, చుండ్రు వంటివి దూరం అవుతాయి.
దురద నుంచి విముక్తి లభిస్తుంది. """/" /
అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు దాల్చిన చెక్క పొడిని( Cinnamon Powder ) వేసుకోవాలి.
అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, నాలుగు టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్ ( Olive Oil )వేసుకుని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్‌కు అప్లై చేసి కాసేపు మసాజ్ చేసుకోవాలి.గంట అనంతరం శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.
ఈ రెమెడీతో కూడా చాలా ఈజీగా తల దురద నుండి ఉపశమనాన్ని పొందొచ్చు.
"""/" /
ఇక తల దురదను వదిలించడానికి మరో చిట్కా ఉంది.అందుకోసం ఒక బౌల్ లో రెండు టేబుల్ స్పూన్లు షుగర్, రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ వేసి బాగా మిక్స్ చేయాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ కు అప్లై చేసుకుని ఐదు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకోవాలి.
గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి తల స్నానం చేయాలి.ఇలా చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది.
ఏంటి గోవా ఒక టూరిస్టు ట్రాపా.. దాన్ని బహిష్కరించాలంటూ నెట్టింట రచ్చ!