ఛాతిలో మంటను క్ష‌ణాల్లో త‌గ్గించే బెస్ట్ రెమెడీస్ ఇవే?

ఛాతిలో మంట ఆడ‌, మ‌గ అనే తేడా లేకుండా అంద‌రినీ త‌ర‌చూ ఇబ్బంది పెట్టే స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.

ఛాతిలో మంట సాధార‌ణ స‌మ‌స్యే అయిన‌ప్ప‌టికీ తీవ్ర ఇబ్బందిని అసౌక‌ర్యాన్ని క‌లిగిస్తుంది.ప‌డుకున్నా, వంగినా ఈ స‌మ‌స్య మ‌రింత తీవ్రంగా ఉంటుంది.

మ‌సాలా వంట‌లు తిన్నా, వేపుడు ఆహారాలు తిన్నా, టీ మ‌రియు కాఫీలు అధికంగా తీసుకున్నా, వేళ‌కు తిన‌క‌పోయినా ఛాతిలో మంట ఏర్పడుతూ ఉంటుంది.

ఒక్కో సారి మందులు వాడినా ఈ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌లేరు.అయితే కొన్ని న్యాచుర‌ల్ టిప్స్ ద్వారా ఛాతిలో మంట‌ను క్ష‌ణాల్లోనే నివారించుకోవ‌చ్చు.

మ‌రి ఆ టిప్స్ ఏంటో చూసేయండి.బొప్పాయి ఛాతిలో మంట‌కు చెక్ పెట్ట‌డంలో ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తుంది.

అందువ‌ల్ల‌, ఛాతిలో మంట వ‌స్తున్న‌ప్పుడు బాగా పండిన బొప్పాయి తీసుకున్నా మంచిది.ఒక వేళ బొప్పాయి లేకుండా యాపిల్ పండు తీసుకున్నా మంచి ఫ‌లితం ఉంటుంది.

అలాగే ఓట్స్ కూడా ఛాతిలో మంట‌ను దూరం చేయ‌గ‌ల‌వు.ఓట్స్‌ను పాల‌లో నాన‌బెట్టి రెండు స్పూన్ల చొప్పున తీసుకుంటే అందులో ఉండే పీచుపదార్థం పొట్ట‌లో అదనంగా ఉత్పత్తయ్యే యాసిడ్‌ను పీల్చుకుని ఛాతీలో మంటను తగ్గిస్తుంది.

పాలు లేకుంటే నీటిలో నాన‌బెట్టి కూడా ఓట్స్‌ను తీసుకోవ‌చ్చు. """/" / ఎండు ద్రాక్ష కూడా ఛాతి మ‌రియు క‌డుపు మంట‌ను చ‌ల్లార్చ‌గ‌ల‌వు.

కొన్ని ఎండు ద్రాక్ష‌ల‌ను నోట్లో వేసుకుని న‌ములుతూ రసం మెల్ల మెల్ల‌గా మింగాలి.

లేదా ఎండు ద్రాక్ష‌ను గోరు వెచ్చ‌ని నీటిలో మెత్త‌గా చేసి ఆ నీటీని తీసుకోవాలి.

ఇలా ఎలా చేసినా వెంట‌నే ఉప‌శ‌మ‌నం పొందుతారు. """/" / ఇక ఇంట్లో పెరిగే క‌ల‌బంద నుంచి గుజ్జు తీసుకుని అందులో స్వ‌చ్ఛ‌మైన తేనె క‌లిపి తీసుకోవాలి.

ఒకటి లేదా రెండు స్పూన్ల చొప్పున ఈ మిశ్ర‌మాన్ని తీసుకుంటే ఛాతిలో మంట త్వ‌ర‌గా త‌గ్గు ముఖం ప‌డుతుంది.

పీరియడ్స్ ఆన్ టైమ్ కి రావాలంటే ఇలా చేయండి..!