Herbal Tea : వేసవిలో వేగంగా బరువు తగ్గడానికి బెస్ట్ టీ ఇది.‌. అస్సలు మిస్ అవ్వకండి!

అధిక బరువు మీకు అతి పెద్ద సమస్యగా మారిందా.? చాలా కాలం నుంచి ఓవర్ వెయిట్ తో బాధపడుతున్నారా.

? బరువు తగ్గడం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే హెర్బల్ టీ మీకు చాలా బాగా సహాయపడుతుంది.

అందులోనూ ప్రస్తుత వేసవికాలంలో వెయిట్ లాస్( Weight Loss) అవ్వడానికి ఈ టీ ది బెస్ట్ వన్ అని చెప్పుకోవచ్చు.

ఈ టీ మీరు బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.అదే సమయంలో ప్రస్తుత వేసవి కాలానికి అనుగుణంగా మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ ను కూడా అందిస్తుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెర్బల్ టీను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా అంగుళం అల్లం ముక్కను తీసుకుని శుభ్రంగా పొట్టు తొలగించి వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.

ఆపై అల్ల‌ను సన్నగా తురుముకుని పెట్టుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ సోంపు మరియు రెండు యాలకులు ( Cardamom)తీసుకుని కచ్చాపచ్చాగా దంచుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ కాస్త హీట్ అవ్వగానే దంచి పెట్టుకున్న యాలకులు మరియు సోంపు వేసుకోవాలి.

అలాగే అల్లం తురుము కూడా వేసి 12 నుంచి 15 నిమిషాల పాటు మరిగించాలి.

"""/" / ఆపై స్టవ్ ఆఫ్ చేసుకుని మరిగించిన వాటర్ ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ వాటర్ లో రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ కలిపితే మన హెర్బల్ టీ సిద్ధమవుతుంది.

ప్రతిరోజు ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ కు అరగంట ముందు ఈ టీ ను తీసుకోవాలి.

ఈ హెర్బల్ టీ మన మెటబాలిజం రేటును పెంచుతుంది.అతి ఆకలిని అరికడుతుంది.

వెయిట్ లాస్ ను ప్రమోట్ చేస్తుంది.నిత్యం ఈ టీ ను తీసుకుంటే మీరు మరింత వేగంగా బరువు తగ్గుతారు.

కొద్ది రోజుల్లోనే నాజూగ్గా మారుతారు. """/" / అలాగే ఈ హెర్బల్ టీ వేసవిలో బాడీకి మంచి కూలింగ్ ఎఫెక్ట్ ను ఇస్తుంది.

జీర్ణవ్యవస్థను చురుగ్గా మారుస్తుంది.గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు మీ దరిదాపుల్లోకి రాకుండా ఈ టీ అడ్డుకట్ట వేస్తుంది.

ఇక వేసవిలో చాలా మంది అధిక రక్తపోటుకు గురవుతుంటారు.అయితే ఈ హెర్బల్ టీ రక్తపోటును అదుపులో ఉంచడానికి సైతం తోడ్ప‌డుతుంది.

కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలని భావిస్తున్న వారు ఈ హెర్బల్ టీ మిస్ అవ్వకుండా రెగ్యుల‌ర్ డైట్ లో త‌ప్ప‌క చేర్చుకోండి.

నల్ల ద్రాక్షతో నల్ల మచ్చలకు చెక్.. ఎలా వాడాలంటే?