బ్రేక్ ఫాస్ట్ లో ఇలాంటి ఆహారాన్ని తీసుకోవడం వలన.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా బిజీ లైఫ్ ను గడుపుతున్నారు.అలాగే చాలామంది బిజీ లైఫ్ స్టైల్ లో అల్పాహారం మానేస్తున్నారు.

అయితే అల్పాహారం( Breakfast ) మానడం ఆరోగ్యానికి అసలు మంచిది కాదు.మనం రోజును ఎలా ప్రారంభించాము అనేది మిగిలిన సమయంలో మన శక్తి పై ప్రభావాన్ని చూపుతుంది.

కాబట్టి అల్పాహారం మానేయడం అస్సలు మంచిది కాదు.అల్పాహారం పోషకమైనదిగా కూడా ఉండాలి.

ఫైబర్ అధికంగా ఉండే అల్పాహారాన్ని తీసుకోవడం చాలా ఉత్తమం.ఇది రోజును ప్రారంభించడానికి శరీరానికి శక్తిని ఇస్తుంది.

అలాగే ఫైబర్ అధికంగా ఉండే ఆహారం జీర్ణ క్రియకు సహాయపడుతుంది. """/" / అంతేకాకుండా వివిధ జీర్ణ సమస్యలు( Digestion Problems ), కడుపునొప్పి లాంటి సమస్యల నుండి కూడా రక్షిస్తుంది.

అయితే అల్పాహారంలో ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.అయితే ఓట్స్ కరిగే ఫైబర్ మంచి మూలం.

ఇది కొలెస్ట్రాల్ నీ తగ్గించడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.అంతేకాకుండా బెర్రీలు, గింజలు కూడా మంచి మూలాలు.

ఇవి విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి.ఓట్స్ తో పాటు బెర్రీలు, గింజలను( Oats With Berries ) తీసుకోవడం వలన ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు.

అయితే హోల్ టోస్ట్ ఫైబర్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లో మంచి మూలం.ఇది ఉదయాన్నే శక్తిని అందిస్తుంది.

అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ ఉన్నాయి.అలాగే గుడ్లు కూడా మంచి ప్రోటీన్ అని చెప్పవచ్చు.

ఈ మూడింటితో కూడిన అల్పాహారాన్ని తీసుకోవడం వలన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.ఇక పెరుగు కూడా ప్రోటీన్, కాల్షియం యొక్క అద్భుతమైన మూలం.

అంటే కాకుండా పండ్లు, కూరగాయలు కూడా ఫైబర్, విటమిన్లు, ఖనిజాలకు మంచి మూలం.

"""/" / అలాగే అల్పాహారంలో బెర్రీలు, అరటి పండ్లు, ఆపిల్స్ లాంటివి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

ఇక అంతే కాకుండా పండ్లు కూరగాయలు పెరుగుతో చేసిన స్మూతీస్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

ఇక చియా పుడ్డింగ్( Chia Pudding ) అనేది కూడా ఫైబర్ తో కూడిన ఆరోగ్యకరమైన, రుచికరమైన అల్పాహారం.

కాబట్టి చియా పుడ్డింగ్ పండ్లు, గింజలు, తేనె ఆపిల్ సిరప్ తో అలంకరించుకొని తీసుకోవడం మరింత టేస్టీగా కూడా ఉంటుంది.

పొడవాటి నల్లని కురుల కోసం ఈ హెయిర్ మాస్క్ ను తప్పక ట్రై చేయండి!