వర్షాకాలంలో కేశాలను రక్షించే బెస్ట్ మాస్క్‌లివే!
TeluguStop.com
అసలే వర్షాకాలం.ఈ వర్షాల్లో తడవడం వల్ల దాదాపు అందరూ జుట్టు సమస్యలు ప్రధానంగా ఎదుర్కొంటారు.
ముఖ్యంగా చుండ్రు, దురద, జుట్టు పొcపోవడం, పొడి జుట్టు, జుట్టు రాలడం.ఇలా అనేక సమస్యలు తలెత్తుతాయి.
మిగిలిన సీజన్స్ కంటే ఈ సీజన్‌లో శిరోజాలను రక్షించుకోవడం కాస్త కాష్టమనే చెప్పాలి.
అయితే ఇప్పుడు చెప్పబోయే టిప్స్ ఫాలో అయితే.ఖచ్చితంగా వర్షాకాలంలో కేశాలను సంరక్షించుకోవచ్చు.
మరి టిప్స్ ఏంటో లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.ముందుగా ఒక బౌల్‌లో ఒక స్పూన్ చప్పున కొకొనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, బాదం ఆయిల్ తీసుకుని వేడి చేయాలి.
ఇప్పుడు వేడి చేసిన ఆయిల్ గోరువెచ్చగా అయ్యాక.తలకు పట్టించాలి.
అనంతరం కాసేపు మసాజ్ చేసుకుని.తలస్నానం చేయాలి.
ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గడంతో పాటు కేశాలు స్మూత్‌గా మారతాయి.
రెండొవది.ఒక బౌల్ తీసుకుని అందులో బాగా పడిన అరటి పండు పేస్ట్, పెరుగు, ఎగ్ వైట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కేశాలకు పట్టించి.అర గంట పాటు వదిలేయాలి.
అనంతరం గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయాలి.ఇలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేయడం వల్ల పొట్లిపోయిన జుట్టు మామూలు స్థితికి వస్తుంది.
మరియు కేశాలు బలంగా మారతాయి.మూడొవది.
ఒక బౌల్ తీసుకుని అందులో కలబంద గుజ్జు మరియు నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి.ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాల పాటు ఆర నివ్వాలి.
ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయాలి.ఇలా వారానికి ఒకసారి చేయడం వల్ల చుండ్రు, దురుద సమస్యలు దూరం అవుతాయి.
మరియు జుట్టు సిల్కీగా మారుతుంది.
సింహంపై ఎదురుదాడి చేసిన అడవి దున్న.. వైరల్ వీడియో