ఈ పండ్లు తింటే..మీ దంతాలు దృఢంగా మార‌డం ఖాయం!

వ‌య‌సు పైబ‌డే కొద్ది దంతాలు బ‌ల‌హీన ప‌డ‌టం స‌ర్వ‌ సాధార‌ణం.అయితే ఈ మ‌ధ్య కాలంలో దంతాల బ‌ల‌హీన‌త అనేది చిన్న వ‌య‌సు వారిలో సైతం క‌నిపిస్తోంది.

సరైన దంత సంరక్షణ పాటించకపోవడం, ఆహార‌పు అల‌వాట్లు, పోష‌కాల లోపం, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల దంతాలు బ‌ల‌హీన ప‌డి వ‌దులుగా మారిపోతాయి.

అయితే దంతాల‌ను బ‌లోపేతం చేసేందుకు కొన్ని కొన్ని పండ్లు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.మ‌రి ఆ పండ్లు ఏంటీ అన్న‌ది ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

స్ట్రాబెరీలు చూసేందుకు అందంగా, తినేందుకు రుచిగా ఉండే ఈ పండ్ల‌లో బోలెడ‌న్ని పోష‌కాలు కూడా నిండి ఉంటాయి.

అందుకే స్ట్రాబెరీలు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.ముఖ్యంగా స్ట్రాబెరీల్లో ఉండే విట‌మిన్ సి, విట‌మిన్ కెలు దంతాల‌ను దృఢంగా మారుస్తాయి.

అంతేకాదు, చిగుళ్ల వాపు, నోటి దుర్వాస‌న వంటి స‌మ‌స్య‌లు కూడా దూరం అవుతాయి.

అందుకే క‌నీసం రోజుకు ఒక స్ట్రాబెరీ అయినా తీసుకుంటే మంచిది.అలాగే దంత సంర‌క్ష‌ణ‌లో కివి పండు కూడా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

కివి పండులో పుష్క‌లంగా ఉండే కాల్షియం, విటమిన్ కె మ‌రియు ఫైబర్ వంటి పోష‌కాలు దంతాల‌ను పాడుచేసే యాసిడ్స్‌ను న్యూట్రలైజ్‌ చేస్తాయి.

మ‌రియు దంతాల‌ను బ‌లంగా మారుస్తాయి. """/"/ ఆరెంజ్ పండ్లు కూడా దంతాల ఆరోగ్యానికి గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.

ఆరెంజ్ పండ్ల‌లో ఉండే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు పళ్లపై మరకలకి కారణమైన బ్యాక్టీరియాని అదుపు చేస్తాయి.

చిగురు వాపు రాకుండా నివారిస్తాయి.మ‌రియు బ‌ల‌హీన‌మైన దంతాల‌ను గ‌ట్టిప‌డేలా చేస్తాయి.

ఇక దంతాల‌ను దృఢ‌ప‌ర‌చ‌డంలో యాపిల్ కూడా సూప‌ర్‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది.రోజుకో యాపిల్ తింటే అందులో ఉండే పోస‌ఖాలు.

చిగుళ్ళ నొప్పి, వాపు మరియు దంతాలు ఊగడం నివారిస్తుంది.యాపిల్‌లోని ఫైబర్‌ దంతాలను శుభ్రప‌రిచి తెల్ల‌గా మెరిసేలా చేస్తుంది.

‘Modern Masters’ On Netflix Showcases The Extraordinary Journey Of S.S. Rajamouli: Watch It Now For These MOMENTS