గుండె జ‌బ్బుల‌కు అడ్డుక‌ట్ట‌ వేసే ఈ పండ్ల‌ను మీరు తింటున్నారా?

ఇటీవ‌ల కాలంలో వ‌య‌సుతో సంబంధం లేకుండా చాలా మంది గుండె జ‌బ్బుల బారిన ప‌డుతూ ప్రాణాలు విడుస్తున్నారు.

ఆహార‌పు అల‌వాట్లు, వ్యాయామాలు చేయ‌క‌పోవ‌డం, ఒత్తిడి, పెయిన్ కిల్ల‌ర్స్ ఎక్కువ‌గా వాడ‌టం, మ‌ద్య‌పానం ఇలా ర‌క ర‌కాల అంశాలు గుండెను రిస్క్‌లో ప‌డేస్తున్నాయి.

అందుకే గుండె ఆరోగ్యంపై శ్ర‌ద్ధ చూపాల‌ని నిపుణులు చెబుతుంటారు.అయితే గుండె జ‌బ్బుల నుంచి ర‌క్షించ‌డంలో కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

అటువంటి వాటిలో ఎర్ర ద్రాక్ష పండ్లు కూడా ఒక‌టి.ద్రాక్ష పండ్ల‌లో ఎరుపు రంగు ద్రాక్ష పండ్లు ఎంతో ప్ర‌త్యేక‌మైన‌వి.

మిగిలిన వాటితో పోలిస్తే వీటిలో పోష‌కాలు ఎక్కువ‌గానే ఉంటాయి.అందుకే ఎర్ర ద్రాక్ష పండ్లు ఆరోగ్య ప‌రంగా అనేక ప్ర‌యోజ‌నాలను అందిస్తాయి.

ముఖ్యంగా గుండె జ‌బ్బుల‌కు అడ్డు క‌ట్ట వేయ‌డంలో ఇవి ఎఫెక్టివ్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.అవును, ఎర్ర ద్రాక్ష పండ్ల‌ను ప్ర‌తి రోజు ఒక క‌ప్పు చొప్పున తీసుకుంటే.

వాటిలో ఉండే ప‌లు పోష‌క విలువ‌లు ర‌క్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను క‌రిగింప చేసి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.

త‌ద్వారా గుండె పోటు, ఇత‌ర గుండె సంబంధిత జ‌బ్బులు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

"""/" / అలాగే ఎరుపు రంగు ద్రాక్ష పండ్ల‌లో శ‌క్తి వంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్క లంగా ఉంటాయి.

ఇవి శ‌రీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశ‌నం చేసి క్యాన్స‌ర్ క‌ణాలు వృద్ధి చెంద‌కుండా చెక్ పెడ‌తాయి.

అందు వ‌ల్ల‌ వీటిని డైట్‌లో చేర్చుకుంటే క్యాన్స‌ర్ వంటి ప్ర‌మాద‌క‌ర వ్యాధి వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంది.

అంతే కాదు, ఎర్ర ద్రాక్ష పండ్లు త‌ర‌చూ తీసుకుంటే లైంగిక సామ‌ర్థ్యం పెరుగుతుంది.

వెయిట్ లాస్ అవుతారు.కీళ్లు, మోకాళ్ల‌ నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

మ‌రియు మెద‌డు మునుప‌టి కంటే చురుగ్గా మారి.జ్ఞాప‌క శ‌క్తి రెట్టింపు అవుతుంది.

ఆడవారు వారానికి ఒక్కసారైనా మెంతికూర తినాలట.. ఎందుకో తెలుసా?