వేస‌విలో వేధించే డీహైడ్రేషన్‌కు ఈ పుడ్స్‌తో చెక్ పెట్టేయండి!

వేస‌వి కాలంలో మొద‌లైపోయింది.ఈ సీజ‌న్‌లో మండే ఎండ‌ల కార‌ణంగా చెమ‌ట‌లు, చికాకు, అధిక దాహం వంటి స‌మ‌స్య‌ల‌తో పాటు డీహైడ్రేష‌న్ స‌మ‌స్య కూడా కాస్త ఎక్కువ‌గానే ఉంటుంది.

ఎండల‌ తీవ్రతకు శరీరంలోని నీరంతా చమట రూపంలో బయటికి వచ్చేస్తుంది.దాంతో శ‌రీరంలోని నీటి శాతం త‌గ్గిపోయి.

డీహైడ్రేషన్‌కు దారి తీస్తుంది.ఇక ఈ డిహైడ్రేష‌న్ ఏర్ప‌డిందంటే.

వాంతులు, వికారం, విరోచనాలు, క‌ళ్లు తిర‌గ‌డం, చర్మం ఎర్రగా పొడిబారడం, విపరీతమైన నీరసం, మూత్ర విసర్జన తగ్గడం, నోరు త‌ర‌చూ ఎండిపోవ‌డం ఇలా ఎన్నో స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడ‌తాయి.

ఒక్కోసారి ప్రాణాలు పోయే రిస్క్ కూడా ఉంటుంది.అందుకే డీహైడ్రేష‌న్ స‌మ‌స్య‌ను ఎంత త్వ‌ర‌గా నివారించుకుంటే అంత మంచిది.

అయితే కొన్ని కొన్ని ఆహారాలు డీహైడ్రేష‌న్ స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌డంతో ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తాయి.

మ‌రి ఆ ఆహారాలు ఏంటీ అన్న‌ది ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.డీహైడ్రేష‌న్ స‌మ‌స్య‌ను దూరం చేయ‌డంలో టమాటాలు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

ట‌మాటాల్లో పోష‌కాల‌తో పాటు నీటి శాతం కూడా అధికంగా ఉంటుంది.అందువ‌ల్ల ట‌మాటాల‌తో త‌యారు చేసిన జ్యూస్ లేదా స‌లాడ్స్‌ను డైట్‌లో చేర్చుకుంటే మంచిది.

అలాగే ఎండు ద్రాక్షాల‌ను నీటిలో రెండు గంట‌ల పాటు నాన‌బెట్టి.ఆ త‌ర్వాత జ్యూస్ చేసుకుని సేవిస్తే.

డీహైడ్రేష‌న్ స‌మ‌స్య దూరం అవుతుంది. """/" / ప‌లు ర‌కాల పండు కూడా డీహైడ్రేష‌న్‌కు చెక్ పెట్ట‌డంతో సూప‌ర్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.

అలాంటి వాటిలో బొప్పాయి, యాపిల్‌, కర్బూజ, దానిమ్మ‌, పుచ్చ‌కాయ‌, స‌పోటా వంటివి శ‌రీరాన్ని హైడ్రేట‌డ్‌గా ఉంచేందుకు స‌హాయ‌ప‌డ‌తాయి.

అలాగే గోధుమ గ‌డ్డి జ్యూస్ కూడా డీహైడ్రేషన్ స‌మ‌స్య‌ను నివారిస్తుంది.ఇక ఈ ఆహార‌ల‌తో పాటు వాట‌ర్ త‌ర‌చూ తీసుకోవాలి.

మ‌జ్జిగ‌, కొబ్బ‌రి నీళ్లు వంటివి డైలీ డైట్‌లో చేర్చుకోవాలి.ఆల్క‌‌హాల్, మ‌సాలా వంట‌లు, నూనె ఆహారాలు, మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండాలి.

అల్లు అర్జున్ కి ఒక రూల్..వారికి ఒక రూలా… బన్నీ అరెస్టుపై సుమన్ షాకింగ్ కామెంట్స్!