వేసవి వ్యాధులకు దూరంగా ఉండాలంటే ఈ ఫుడ్స్ డైట్‌లో ఉండాల్సిందే!
TeluguStop.com
వేసవి కాలం వస్తూ వస్తూనే ఎన్నో వ్యాధులను తనతో పాటు తీసుకువస్తోంది.పైగా ఆ వ్యాధులు ఎంతో తీవ్ర తరంగా ఉంటాయి.
అందుకే వేసవి కాలం అంటేనే భయపడిపోతుంటారు.అయితే వేసవి వ్యాధులకు దూరంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తమ డైట్‌లో ఖచ్చితంగా కొన్ని కొన్ని ఫుడ్స్‌ను చేర్చుకోవాల్సి ఉంటుంది.
మరి ఆ ఫుడ్స్ ఏంటీ.? వాటిని సమ్మర్‌లో ఎందుకు తీసుకోవాలి.
? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో పల్లీ చట్నీని తింటుంటారు.
దాంతో దాహం విపరీతంగా వేస్తుంది.అందుకే, సమ్మర్‌లో పుదీనా చట్నీనే ప్రిఫర్ చేయాలి.
పుదీనా చట్నీని తీసుకుంటే అధిక దాహం సమస్య దరి దాపుల్లోకి రాకుండా ఉంటుంది.
శరీరం చల్లగానూ ఉంటుంది. """/" /
పుచ్చకాయ.
సమ్మర్‌లో తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఫ్రూట్ ఇది.ప్రతి రోజు పుచ్చకాయ ముక్కలను తింటే వేసవిలో శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది.
పుచ్చతో పాటు కర్బూజ, ఆరెంజ్, బ్లూ బెర్రీస్, బొప్పాయి వంటి పండ్లను కూడా తీసుకుంటే వేసవి వేడి వల్ల వచ్చే నీరసం, తలనొప్పి, అలసట వంటి వాటికి దూరంగా ఉండొచ్చు.
వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి పొట్లకాయ చాలా బాగా సహాయపడుతుంది.వారంలో రెండు లేదా మూడు సార్లు పొట్లకాయను తీసుకుంటే వేసవి వేడిని తట్టుకునే శక్తి లభిస్తుంది.
సమ్మర్‌లో వేధించే సమస్యల్లో వడదెబ్బ ఒకటి.అయితే వడదెబ్బ నుంచి రక్షించడంలో ఉల్లిపాయ గ్రేట్‌గా సహాయపడుతుంది.
అందుకే ప్రతి రోజు ఉల్లిని తీసుకోవాలి.మజ్జిగలో ఉల్లిపాయలను కలిపి తాగితే ఇంకా మంచిది.
ఇక వీటితో పాటు కీరదోస, పెరుగు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, చేపలు, బీరకాయ, గుమ్మడికాయ, పాలకూర, దానిమ్మపండు, పియర్స్, మెంతులు వంటి ఆహారాలను కూడా ఆహారంలో భాగంగా చేసుకుంటే వేసవి వ్యాధుల నుంచి రక్షణ పొందొచ్చు.
పుష్ప 2 ప్రతి సీనుకి దిమ్మ తిరిగి పోవాల్సిందే.. అంచనాలను పెంచేసిన దేవిశ్రీ!