స్వీట్స్‌కు దూరంగా ఉండాల‌నుకుంటున్నారా..? ఇలా చేస్తే స‌రి…

స్వీట్స్‌.అందులోనూ పంచ‌దారతో త‌యారు చేసిన స్వీట్స్ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కావు.

ఈ విష‌యం అంద‌రికీ తెలుసు.కానీ, స్వీట్స్‌ను చూసే స‌రికి నోరు క‌ట్టుకోలేక‌.

ట‌క్కున లాగించేస్తుంటారు చాలా మంది.వాస్త‌వానికి స్వీట్ల‌ను ఓవ‌ర్ తిన‌డం వ‌ల్ల వృద్ధాప్య ఛాయలు త్వ‌ర‌గా రావ‌డం, అధిక బ‌రువు, హైకొలెస్ట్రాల్, హైపర్ టెన్షన్, డ‌యాబెటిస్ ఇలా ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయి.

కాబ‌ట్టి, స్వీట్స్‌ను తినాల‌నే కోరిక‌ల‌ను కంట్రోల్ చేసుకోవ‌డం చాలా అవ‌స‌రం.మ‌రి ఎలా స్వీట్స్‌ను తినాల‌నే కోరిక‌ల‌ను కంట్రోల్ చేసుకోవాలి.

? ఎలా వాటికి దూరంగా ఉండాలి.? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

సాధార‌ణంగా ఆక‌లిగా ఉంటే.స్వీట్స్ తినాల‌నే కోరిక మ‌రింత రెట్టింపు అయిపోతుంది.

అంటే ముందు ఆక‌లిని కంట్రోల్ చేసుకోవాలి.అలా చేసుకోవాలంటే.

ప్ర‌తి రోజు రెండు ఊడికించిన గుడ్డు లేదా ఆమ్లెట్ తీసుకోవాలి.ఎందుకూ అంటే.

ప్రోటీన్లు మ‌రియు ఇత‌ర పోష‌కాలు పుష్క‌లంగా ఉండే గుడ్డు తీసుకోవ‌డం వ‌ల్ల‌ ఎక్కువ సమయం ఆకలి కాకుండా నివారిస్తుంది.

దాంతో స్వీట్స్‌పై కోరిక కూడా త‌గ్గుతుంది. """/" / అలాగే కీరదోసకాయ స్వీట్స్‌ను తినాల‌నే కోరిక‌ను బ‌ల‌హీన ప‌ర‌చ‌డంలో ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తుంది.

పైగా మిన‌ర‌ల్స్‌, ఫైబ‌ర్‌, విట‌మిన్స్ ఉంటే ఈ కీర‌దోస‌కాయ తిన‌డం వ‌ల్ల వెయిట్ కూడా లాస్ అవుతారు.

ఇక వంట‌ల‌కు ఏవేవో నూనెలు కాకుండా ఆలివ్ ఆయిల్ వాడితే.అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు షుగర్ కర్వింగ్స్ చాలా ఫాస్ట్‌గా త‌గ్గిస్తాయి.

దాంతో ఈజీగా స్వీట్స్‌పై నుంచి మీ దృష్టి మ‌ల్లుతుంది. """/" / అదేవిధంగా, న‌ట్స్ ముఖ్యంగా బాదం, జీడిప‌ప్పు, పిస్తా ప‌ప్పు, వాల్న‌ట్స్ వంటివి తీసుకోవాలి.

ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేయ‌డంమే కాదు.ఆకలిని తగ్గించే ద్రవాలను బ్రెయిన్ కు అందిస్తుంది.

దాంతో షుగర్ తినాల‌నే కోరిక‌లు క్ర‌మంగా త‌గ్గిపోతాయి.ఇక షుగర్ కర్వింగ్స్ ఎక్కువ‌గా ఉంటే.

అలాంటి వారు ప్ర‌తి రోజు ఒక బౌల్ మిక్స్డ్ ఫ్రూట్స్ తినడం వల్ల చాలా మంచిదంటున్నారు.

ముఖ్యమంత్రి కి భద్రత ఇవ్వలేని కమిషనర్ కాంతి రాణా టాటా పై చర్యలు తీసుకోవాలి – బీదా రవిచంద్ర