మీకు షుగ‌ర్ వ్యాధి ఉందా..అయితే స‌మ్మ‌ర్‌లో ఇవి తీసుకోవాల్సిందే?

షుగ‌ర్ వ్యాధి దీనినే మ‌ధుమేహం లేదా డ‌యాబెటిస్ అని కూడా అంటుంటారు.పేర్లు ఎన్నున్నా జ‌బ్బు ఒక్క‌టే.

ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు ఉండాల్సిన దానికంటే ఎక్కువ‌గా ఉంటే ఈ మ‌ధుమేహం స‌మ‌స్య ఏర్ప‌డుతుంది.

నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది మ‌ధుమేహం వ్యాధి బారిన ప‌డుతూ నానా ఇబ్బందులు ప‌డుతున్నారు.

ఇక ఒక్క సారి మ‌ధుమేహం వ‌చ్చిందంటే జీవిత కాలం మందులు వాడుతూ జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యంగా వేస‌వి కాలంలో షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాలి.ఎందుకంటే ఎండ‌ల‌ను త‌ట్టుకునేందుకు, వేస‌వి తాపాన్ని తీర్చుకునేందుకు, అల‌స‌ట మ‌రియు నీర‌సం స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకునేందుకు చాల మంది ఏవి ప‌డితే అవి తింటూ షుగ‌ర్ లెవ‌ల్స్‌ను పెంచేసుకుంటారు.

అందుకే తీసుకునే ఆహారం విష‌యంలో ఎన్నో నియ‌మాలు పాటించాలి.అలాగే కొన్ని కొన్ని ఆహారాల‌ను ఖ‌చ్చితంగా డైట్‌లో చేర్చుకోవాలి.

అవేంటో ఇప్పుడు చూసేయండి. """/"/ షుగ‌ర్ వ్యాధి ఉన్న వారు త‌మ డైట్‌లో దోస‌కాయ‌ను చేర్చుకోవాలి.

దోస‌కాయ‌లో కార్బొహైడ్రేట్లు, కేల‌రీలు త‌క్కువ‌గాన్యూట్రిషియ‌న్లు ఎక్కువ‌గా ఉంటాయి.మ‌రియు వాట‌ర్ కంటెంట్ కూడా అధిక‌మే.

కాబ‌ట్టి, దోస‌కాయ తీసుకుంటే షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉండ‌డంతో పాటు వేస‌విలో ఇబ్బంది పెట్టే డీహైడ్రేష‌న్‌, నీర‌సం స‌మ‌స్య‌లు ద‌రి చేర‌వు.

"""/"/ అలాగే వేస‌విలో షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు తిన‌గ‌లిగే ఆహారాల్లో పెస‌ర‌ప‌ప్పు ఒక‌టి.

చ‌క్కెర స్థాయిల‌ను అదుపు చేసే గుణంతో పాటు శ‌రీర వేడిని చ‌ల్లార్చే గుణం కూడా పెస‌ర‌ప‌ప్పుకు ఉంటుంది.

స‌మ్మ‌ర్‌లో షుగర్ వ్యాధి గ్రస్తులకు ఓట్స్ సరైన ఆహారం.అందువ‌ల్ల‌, ఓట్స్‌ను నిత్యం తీసుకుంటే మంచిది.

ఇక వేస‌విలో ఎండ నుంచి ఉప‌శ‌మ‌నం పొందేందుకు పండ్ల‌ను ఎక్కువ‌గా తింటారు.కానీ, షుగ‌ర్ ఉన్న‌వారు అన్ని పండ్లు తినేందుకు ఆస్కారం ఉండ‌దు.

కానీ, యాపిల్స్, పియర్స్, బెర్రీస్, బొప్పాయి వంటి పండ్ల‌ను తీసుకుంటే ఎలాంటి స‌మ‌స్య ఉండ‌దు.

నల్లటి వలయాలను మాయం చేసే సూపర్ పవర్ ఫుల్ రెమెడీస్ ఇవే!