ప్రసవం తర్వాత త్వరగా రికవరీ అవ్వాలంటే ఈ ఆహారాలు కచ్చితంగా డైట్ లో ఉండాల్సిందే!

ఆడవారికి ప్రసవం అనేది మరో పునర్జన్మ అంటారు.అయితే ప్రసవం మాత్రమే కాదు ప్రసవానంతరం కూడా మహిళలకు అత్యంత కష్టతరమైన సమయం.

డెలివరీ అనంతరం మహిళలు శారీరకంగా, మానసికంగా ఎన్నో సమస్యలను ఫేస్ చేస్తూ ఉంటారు.

ఆ సమయంలో త్వరగా రికవరీ అవ్వాలంటే ఖచ్చితంగా కొన్ని కొన్ని ఆహారాలు డైట్ లో ఉండేలా చూసుకోవాలి.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం పదండి. """/" / ప్రసవం( Delivery ) అనంతరం బాలింతలు త్వరగా జీర్ణం అయ్యే బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి.

అప్పుడే బిడ్డకు కావాల్సినంత పాలు ఉత్ప‌త్తి అవుతాయి.అలాగే తల్లులు త్వరగా రికవరీ అవుతారు.

అందుకోసం ముఖ్యంగా రోజుకు రెండు నుంచి మూడు గ్లాసుల పాలు తాగాలి.అలాగే నెయ్యిని ఖ‌చ్చితంగా మూడు పూట్లా తీసుకోవాలి.

సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, బీట్ రూట్, క్యారెట్, బెండకాయ, కాకరకాయ వంటి కూరగాయలతో పాటు ఆకుకూరల‌ను అధికంగా తీసుకోవాలి.

ప్రసవం అనంతరం పండ్లు తినకూడదని కొందరు చెబుతుంటారు.కానీ ఇది అపోహ మాత్రమే.

యాపిల్, దానిమ్మ, బొప్పాయి వంటి పండ్లను ఎలాంటి భ‌యం పెట్టుకోకుండా తీసుకోవచ్చు.డెలివరీ అనంతరం రోజుకు ఒక స్పూన్ మెంతులు( Fenugreek ) తప్పకుండా తీసుకోవాలి.

గసగసాలు, జీలకర్ర, ధనియాలు, ఇంగువ, వాము వంటి ఆహారాలను రెగ్యులర్ డైట్ లో ఉండేలా చూసుకోవాలి.

"""/" / ఈ ఆహారాలన్నీ మహిళల్లో పాల ఉత్పత్తిని పెంచడ‌మే కాదు రక్తస్రావాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి.

అదే సమయంలో నొప్పుల నుండి విముక్తి పొందడానికి మరియు గర్భాశయం కుంచించుకు పోవడానికి అద్భుతంగా హెల్ప్ చేస్తాయి.

కాబట్టి ప్రసవం అనంతరం ఈ ఆహారాలను అస్సలు మిస్ అవ్వకండి.అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే.

ప్రసవం అనంతరం ఫాస్ట్ ఫుడ్స్( Fast Foods ), జంక్ ఫుడ్స్ కూల్ డ్రింక్స్, టీ, కాఫీ, చేపలు వంటి ఫుడ్స్ ను పూర్తిగా అవాయిడ్ చేయాలి.

ఎందుకంటే ఇవి తల్లితో పాటు తల్లిపాలు తాగే బిడ్డ ఆరోగ్యాన్ని సైతం పాడుచేస్తాయి.

డబుల్ ఇస్మార్ట్ మూవీ టీమ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారా..?