వర్షాకాలంలో ఇమ్యూనిటీని పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే!
TeluguStop.com
చూస్తుండగానే వర్షాకాలం వచ్చేసింది.ఈ వర్షాకాలాన్నే రోగాల కాలం అని కూడా పిలుస్తుంటారు.
ఎందుకంటే, మిగిలిన సీజన్లతో పోలిస్తే.ఈ సీజన్‌లోనే వైరస్‌లు, అంటు వ్యాధులు, విష జ్వరాలు ఎక్కువగా ఉంటాయి.
ఈ నేపథ్యంలో వర్షకాలంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి.
ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుకునేందుకు ప్రయత్నించాలి.రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటేనేరోగాలు దరి చేరకుండా ఉంటాయి.
మరి ఈ వర్షా కాలంలో ఏ ఏ ఆహారాలు తీసుకుంటే.రోగ నిరోధక శక్తి పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా మొక్కజొన్న తింటే.ఎంత బాగుంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అయితే మొక్క జొన్నలు రుచిగా ఉండటమే కాదు ఇమ్యూనిటీ పవర్‌ను పెంచడంలోనూ సహాయపడతాయి.
మరియు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలనూ అందిస్తాయి.కాబట్టి, ఈ సీజన్‌లో మొక్కజొన్నలను అస్సలు వదలకండి.
"""/" /
అలాగే ఈ సీజన్‌లో కొన్ని కొన్ని కూరగాయలు రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఉపయోగపడతాయి.
అలాంటి వాటిలో ముల్లంగి, బీట్ రూట్, దొండకాయ, బీరకాయ, కాకరకాయ, పోట్లకాయ వంటి కూరగాయలు ఉన్నాయి.
వీటిని డైట్‌లో చేర్చుకుంటే మంచిది. """/" /
పండ్లలో బొప్పాయి, యాపిల్, దానిమ్మ, నేరేడు పండ్లు, అరటి పండ్లు వంటివి ఈ వార్షా కాలంలో తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.
అలాగే పసుపు, అల్లం, వెల్లుల్లి, ఉల్లి వంటివి ప్రతి రోజు ఏదో ఒక రూపంలో తీసు కోవాలి.
బెల్లం, నట్స్, గుడ్లు, మినుములు కూడా రోగ నిరోధక శక్తిని పెంచగలవు.అందువల్ల, వర్షాకాలంలో ఇటువంటి ఆహారాలను డైట్‌లో చేర్చుకోవాలి.
మరియు వ్యాయామాలు చేయడం, మంచిగా నిద్ర పోవడం, శరీరానికి సరిపడా వాటర్ తీసుకోవడం చేస్తే రోగాలు దరి చేరకుండా ఉంటాయి.
మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్ సింప్లీ సూపర్బ్.. బాలయ్యను మించిన హీరో అవుతాడా?