ఆస్త‌మాతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే ఈ టిప్స్ మీ కోస‌మే!

ఆస్త‌మా.పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా చాలా మంది ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు.

ముఖ్యంగా ఈ కాలంలో ఆస్త‌మా మ‌రింత ఇబ్బందికి గురి చేస్తుంది.ఆస్త‌మా స‌మ‌స్య ఉన్న వారికి గాలి వేగంగా పీల్చడం, వదలడం చాలా క‌ష్ట‌త‌రంగా మారుతుంది.

ఇక కాసేపు నడిచినా, ఏదైనా పని చేసినా ఆయాసం వచ్చేస్తుంటుంది.అయితే ఈ స‌మ‌స్య‌ను నివారించుకోవాలంటే.

మ‌నం తీసుకునే ఆహారంపై కూడా ఆధార‌ప‌డి ఉంటుంది.అవును, కొన్ని ఆహార ప‌దార్థాల‌ను డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల ఆస్త‌మాకు చెక్ పెట్ట‌వ‌చ్చు.

ఆస్త‌మా ప్రారంభ ద‌శ‌లో ఉంటే గ‌నుక‌.వెల్లుల్లి రెబ్బ‌ల‌ను పాలలో క‌లిపి తీసుకోవాలి.

ఇలా ప్ర‌తి రోజు చేయ‌డం వ‌ల్ల ఆస్త‌మా స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మనం ల‌భిస్తుంది.

ఆస్త‌మా ఉండే వారికి చేప‌లు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.ముఖ్యంగా సాల్మన్, మాకరెల్ వంటివి చేప‌లు వారానికి రెండు సార్లు అయినా తింటే.

ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాట్టీ యాసిడ్స్ ఆస్తమాను బాగా కంట్రోల్ చేస్తాయ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

"""/"/ అలాగే మెంతులు మ‌రియు అల్లంతో క‌లిపి త‌యారు చేసిన డికాష‌న్ తీసుకుంటే.

ఆస్త‌మా స‌మ‌స్య‌కు సులువుగా చెక్ పెట్ట‌వ‌చ్చ‌ట‌.ఇక నిమ్మ‌ కూడా ఆస్త‌మాను నివారించ‌డంలో గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంద‌ని అంటున్నారు.

ప్ర‌తి రోజు భోజ‌నం చేసే ముందు నిమ్మ ర‌సం తీసుకుంటే.ఆస్త‌మా తీవ్ర‌త క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతుంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అదేవిధంగా, రెండు లేదా మూడు స్పూన్ల ఉల్లి ర‌సంలో ఒక స్పూన్ తేనె క‌లిపి రెగ్యుల‌ర్‌గా తీసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల ఉల్లి మ‌రియు తేనెలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆస్త్మా లక్షణాలను నివారిస్తుంది.

మ‌రియు ఆకూకుర‌లు, క్యారెట్స్ వంటివి తీసుకుంటే.ఇందులో ఉండే బీటా కెరోటిన్ రూపంలో ఉండే విట‌మిన్ ఏ శ్వాస స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తుంది.

ఇక ఆస్త‌మా ఉన్న వారు.జంక్ ఫుడ్‌కు మాత్రం చాలా దూరంగా ఉండాలి.

ఎందుకంటే, జంక్ ఫుడ్‌లో ఉండే కొవ్వు ప‌దార్థాలు స‌మ‌స్య‌ను మ‌రింత రెట్టింపు చేస్తుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి21, మంగళవారం 2025