మీ లంగ్స్ ఆరోగ్యంగా ఉండాలా.. అయితే ఇలా చేయాల్సిందే!

లంగ్స్ లేదా ఊపిరితిత్తులు.శ‌రీరంలో అతి ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో ఇవి ముందుంటాయి.

శ్వాసకోశ వ్యవస్థకు మూల‌కేంద్రమైన ఈ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండ‌టం చాలా అవ‌స‌రం.కానీ, నేటి కాలంలో ధూమ‌పానం, మ‌ద్య‌పానం, కాలుష్యం, ఆహారాపు అల‌వాట్లు ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాలు వ‌ల్ల చాలా మంది ఉపిరితిత్తుల స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు.

ఫ‌లితంగా, హాస్ప‌ట‌ల్స్ చుట్టూ తిరుగుతూ.ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టాల్సి వ‌స్తుంది.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే ఆహారాల‌ను డైట్‌లో చేర్చుకుంటే.లంగ్స్ ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు.

తులసి.ఇందులో బోలెడ‌న్ని ఔష‌ధ గుణాలు దాగి ఉన్నాయ‌న్న‌ విష‌యం అంద‌రికీ తెలుసు.

అటు వంటి తుల‌సి లంగ్స్‌ను ఆరోగ్యంగా ఉంచ‌డంలోనూ తోడ్ప‌డ‌తాయి.ముఖ్యంగా ఊపిరితిత్తుల చుట్టూ ఏర్పడిన శ్లేష్మాన్ని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది.

అందువ‌ల్ల.రోజుకు రెండు, మూడు తుల‌సి ఆకులు న‌మ‌లడం లేదా తుల‌సి ఆకుల టీ తీసుకోవ‌డం చేస్తే మంచిది.

అలాగే గ్రీన్ టీ కూడా లంగ్స్ ఆరోగ్యాన్ని మెరుగు ప‌ర‌చ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. """/"/ ఊపిరితిత్తుల‌ వాపును, మంటను కూడా తగ్గించి సులభంగా శ్వాస తీసుకోవడానికి గ్రీన్ టీ స‌హాక‌రిస్తుంది.

యాంటీ ఆక్సిడెంట్స్‌, యాంటీ బయాటిక్, యాంటీ వైర‌ల్ వంటి ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉండే వెల్లుల్లి కూడా లంగ్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

వెల్లుల్లిని డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల ఊపిరితితుల్లో ఉండే ఇన్ఫెక్ష‌న్‌, విషపదార్థాలను తొల‌గిపోతాయి.మ‌రియు త‌ర‌చూ వెల్లుల్లిని తీసుకోవ‌డం వ‌ల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వ‌చ్చే రిస్క్ కూడా త‌గ్గుముఖం ప‌డుతుంది.

ఇక వీటితో పాటుగా.టమోటోలు, క్యాప్సికం, యాపిల్‌, దానిమ్మ‌, బొప్పాయి, ప‌సుపు, అల్లం, జీల‌క‌ర్ర‌, సాల్మన్ ఫిష్‌, న‌ట్స్‌, గుమ్మడి విత్తనాలు,అవిసె గింజలు,పొద్దుతిరుగుడు విత్తనాలు, ఆకుకూర‌లు వంటివి కూడా డైట్‌లో చేర్చుకంటే.

లంగ్స్ ఆరోగ్యంగా ఉంటాయి.అదే స‌మ‌యంలో ధూమ‌పానానికి, మ‌ద్య‌పానానికి దూరంగా ఉండాలి.

మ‌రియు ప్ర‌తి రోజు వ్యాయామాలు చేయాలి.

Sajjala Ramakrishna Reddy : చంద్రబాబును ప్రజలు తిరస్కరించారు..: సజ్జల