వ్యాయామాల తర్వాత ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఫుడ్ ఇదే!
TeluguStop.com

ఆరోగ్యంగా ఉండాలంటే.వ్యాయామాలు తప్పకుండా చేయాలి.


ఈ విషయం అందరికీ తెలుసు.శరీరాన్ని తీర్చిదిద్దడంలో వ్యాయామం ముఖ్య పాత్ర పోషిస్తుంది.


వ్యాయామాలు చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు.అధిక బరువు తగ్గించడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, డయాబెటిస్ రాకుండా చేయడంలో, మానసిక ప్రశాంతత అందించలో, చర్మాన్ని యవ్వనంగా ఉండేలా చేయడంలో, రక్తపోటును అదుపులో ఉంచడంలో ఇలా వ్యాయామాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
అయితే వ్యాయామాలు చేస్తారు.కానీ, వ్యాయామాలు చేసిన తర్వాత ఏం తినాలి.
ఏం తినకూడాదు అన్నది చాలా మందికి అవగాహన ఉండదు.అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి.
సాధారణంగా వ్యాయామాల తర్వాత బాగా అలసిపోయి నీరసంగా ఉంటారు.అలాంటి సమయంలో ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
అలాగే వ్యాయామాలు చేసిన తర్వాత పండ్ల ముక్కలను పెరుగుతో కలిపి తీసుకోవాలి.తద్వారా తక్షణ శక్తి లభించడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
డ్రైఫ్రూట్స్, నట్స్ వంటివి కూడా వ్యాయామాల తర్వాత తీసుకోవచ్చు.ఇక చాలా మంది వ్యాయామం చేసే ముందు అరటి పండు తింటుంటారు.
కానీ, అలా కాకుండా వ్యాయమం తర్వాత అరటిపండు తీసుకుంటే తక్షణ శక్తి పొందొచ్చు.
ఇక వ్యాయామం చేసిన తర్వాత మిల్క్‌షేక్స్, ప్రోటీన్‌షేక్స్, బాదం, తృణధాన్యాలు, పాలు వంటివి తీసుకోవాలి.
మరియు వ్యాయామం ముందు,తర్వాత, మధ్యలో తరచుగా నీరు తీసుకుంటూ ఉండాలి.ఇలా చేయడం వల్ల డీహైడ్రేషన్ బారినపడకుండా ఉంటుందని అంటున్నారు.
అయితే వ్యాయామాల తర్వాత పిజ్జాలు, బర్గర్లు, బ్రెడ్, సాండ్ విచ్ వంటివి అస్సలు తీసుకోకూడదు.
మరియు రెడ్ మీట్, పచ్చికూరగాలు, చీజ్, ఫ్రై చేసిన మాంసాహారం, ప్యాట్ ఫుడ్ వంటివి కూడా వ్యాయామం చేసిన వెంటనే తీసుకోరాదు.
‘మేరా జూతా..’ పాట పాడిన జార్జియా వ్యక్తి: వీడియో వైరల్.. మీరు విన్నారా?