బాన పొట్టతో చింతేలా.. పుదీనా ఆకులతో ఇలా చేస్తే ఇట్టే మాయమవుతుంది!
TeluguStop.com
స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఎంతో మంది బాన పొట్టతో ( Belly Fat )బాధపడుతున్నారు.
బాన పొట్ట కారణంగా మన శరీర ఆకృతి మొత్తం పాడవుతుంది.అలాగే ఎన్నో దీర్ఘకాలిక జబ్బులు కూడా తలెత్తుతుంటాయి.
అందుకే పొట్ట కొవ్వును కరిగించుకునేందుకు ముప్పతిప్పలు పడుతుంటారు.అయితే చింతించకండి.
పుదీనా ఆకులతో ఇప్పుడు చెప్పబోయే విధంగా చేస్తే బాన పొట్ట ఇట్టే మాయమవుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం పుదీనాతో పొట్టను ఎలా కలిగించుకోవచ్చో తెలుసుకుందాం పదండి .
"""/" /
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి.
వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో పది ఫ్రెష్ పుదీనా ఆకులను ( Mint Leaves )కడిగి వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు,( Coriander ) వన్ టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకుని మరిగించాలి.
వాటర్ సగం అయ్యేంతవరకు హీట్ చేయాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
"""/" /
ఇప్పుడు ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon Juice ) కలిపి గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.
రోజుకు ఒకసారి ఈ డ్రింక్ ను తీసుకుంటే పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరిగిపోతుంది.
బాన పొట్ట కొద్దిరోజుల్లోనే నాజూగ్గా మారుతుంది.కాబట్టి బెల్లీ ఫ్యాట్ సమస్యతో సతమతం అవుతున్నవారు తప్పకుండా పుదీనాతో ఈ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ ను తయారు చేసుకునే తీసుకునేందుకు ప్రయత్నించండి.
పైగా ఈ డ్రింక్ ను రోజు తీసుకోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ( Immune System ) బలపడుతుంది.
దగ్గు, జలుబు వంటి సమస్యలు ఉంటే దూరం అవుతాయి.కొలెస్ట్రాల్ కరుగుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రణలో ఉంటాయి.మలబద్ధకం సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.
మరియు బాడీ డీటాక్స్ సైతం అవుతుంది.
సుజీత్ నెక్స్ట్ సినిమాకి హీరో దొరికేశాడా..?