ప్రతిరోజు ఈ రెండు వ్యాయామాలు చేస్తే చాలు.. నెల రోజుల్లోనే బెల్లీ ఫ్యాట్ మాయం..!
TeluguStop.com
ఈ మధ్యకాలంలో చాలామంది ప్రజలు అధిక బరువు సమస్య( Overweight Problem )తో ఎక్కువగా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.
ఆరోగ్యంగా ఉండాలంటే ప్రజలు కచ్చితంగా ఆరోగ్యకరమైన బరువు ఉండాలి.కానీ ఈ మధ్యకాలంలో ప్రజలలో వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా అధిక బరువు ఒక సమస్యగా మారిపోయింది.
అధిక బరువు కారణంగా నలుగురిలో అవమానకరంగా ప్రజలు భావిస్తున్నారు.ఈ సమస్యను ఎలా పరిష్కరిష్కరించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
"""/"/
అధిక బరువు అనేది ప్రతి ఒక్కరిని బాధించే సమస్య అని కచ్చితంగా చెప్పవచ్చు.
శరీరంలోని వివిధ భాగాల్లో పెరిగిపోయే కొవ్వును తొలగించేందుకు చాలా రకాలుగా ప్రయత్నించి చాలామంది ప్రజలు విఫలమవుతున్నారు.
మీకు కూడా బెల్లీ ఫ్యాట్ సమస్య ఉంటే ఇంట్లో ఉండి కొన్ని రకాల వ్యాయమాలు చేసి దీని నుంచి సులభంగా బయటపడవచ్చు.
బెల్లీ ఫ్యాట్ తగ్గించుకునేందుకు ఎలాంటి వ్యాయామం( Exercise ) చేయాలనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
బెల్లీ ఫ్యాట్ అనేది ఈ మధ్యకాలంలో చాలా మందిలో సర్వసాధారణంగా మారిపోయింది.సాధారణంగా పొట్ట చుట్టూ లేదా నడుము చుట్టూ కొవ్వు( Belly Fat ) పేరుకుపోయి అధిక బరువుతో చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు.
"""/"/
ఈ ఫ్యాట్ తొలగించేందుకు రోజు క్రమం తప్పకుండా బర్ఫీ వ్యాయామం చేయాలి.
బర్ఫీ వ్యాయామం అనేది మీ భుజాలను బలోపేతం చేస్తుంది.దానితోపాటు బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.
ముందు నిటారుగా నిలబడి మోకాళ్లు ముడవాలి.రెండు చేతులు కిందకు ఆన్చాలి.
ఇప్పుడు కాళ్ళను వెనక్కు తీసుకెళ్లాలి.ఆ తర్వాత కాళ్ళను తిరిగి చేతుల వరకు తీసుకురావాలి.
చివరగా ఎగురుతూ నిలబడాలి.ఇలా రోజుకు పదిసార్లు చేస్తే ఈ సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు.
"""/"/
అంతేకాకుండా ప్రతిరోజు బేస్ బాల్ వ్యాయామం( Baseball Exercise ) చేయడం వల్ల అధిక బరువు సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు.
ఈ వ్యాయామం చేసేందుకు బేస్ బాల్ అవసరమవుతుంది.బేస్ బాల్ ను నేలపై ఉంచి కాళ్ళను నిటారుగా చేసి చేతుల్ని బేస్ బాల్ చివర్లో ఉంచాలి.
ఈ స్థితిలో మీ కాలి వేళ్లు భూమిపైనే ఉంచాలి.ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ సులభంగా కరిగిపోతుంది.
పొరపాటున కాకితో పెట్టుకున్నారో.. 17 ఏళ్లు నరకమే.. ఎందుకంటే..