వేసవి వేడిని తట్టుకోవాలంటే ఈ డ్రింక్స్ డైట్‌లో ఉండాల్సిందే! TeluguStop.com
వేసవి కాలం ప్రారంభమైంది.తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి.
ఏప్రిల్ నెల ప్రారంభం నుంచే భానుడు భగభగమంటూ తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో ప్రజలు నిత్యావసర పనుల కోసం బయటకు వెళ్లడానికే జంకుతున్నారు.
అయితే వేసవిలో వాతావరణ ఉష్ణోగ్రతలే కాదు.శరీర ఉష్టోగ్రతలు కూడా పెరిగిపోతూ ఉంటాయి.
దాంతో శరీరంలో పెరిగిన అధిక వేడిని తట్టుకోలేక తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే డ్రింక్స్ ను డైట్‌లో చేర్చుకుంటే వేసవి వేడిని తట్టుకునే శక్తిని పొందొచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్స్ ఏంటో తెలుసుకుందాం పదండీ.చెరుకు రసం.
సమ్మర్ లో తప్పకుండా తీసుకోవాల్సిన డ్రింక్ ఇది.అద్భుతమైన రుచిని కలిగి ఉండే చెరుకు రసంలో పోషకాలు మెండుగా ఉంటాయి.
శరీరంలో అధిక వేడిని తొలగించే గుణం కూడా చెరుకు రసంకు ఉంది.అందుకే వేసవిలో తరచూ చెరుకు రసం తీసుకుంటూ ఉండాలి.
రాగి జావ.వేసవి వేడిని తట్టుకోవాలంటే ఉదయం వేళలో దీనిని తాగాల్సిందే.
రోజుకు ఒక గ్లాస్ రాగి జావను తాగితే బాడీ కూల్‌గా మారుతుంది.నీరసం, అలసట వంటివి దరి చేరకుండా ఉంటాయి.
మరియు శరీరం హైడ్రేటెడ్‌గా కూడా ఉంటుంది.క్యారెట్ జ్యూస్.
సమ్మర్‌లో తీసుకోదగని డ్రింక్స్‌లో ఇది ఒకటి.క్యారెట్ జ్యూస్‌ను తాగితే శరీరానికి అలసరమయ్యే పోషకాలెన్నో లభిస్తాయి.
అదే సమయంలో వేసవి వేడిని తట్టుకునే శక్తిని సైతం పొందొచ్చు. """/" /
శరీరంలో అధిక వేడిని తొలగించడానికి నిమ్మ రసం గ్రేట్ గా హెల్ప్ చేస్తుంది.
అందుకోసం ప్రతి రోజు ఉదయాన్నే గ్లాస్ గోరు వెచ్చని నీటిలో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మ రసం, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని తాగాలి.
ఇక ఇవే కాకుండా మజ్జిగ, పుచ్చకాయ రసం, పుదీనా జ్యూస్, సబ్జా వాటర్, ఆరెంజ్ జ్యూస్, మ్యాంగో జ్యూస్ వంటి వాటిని కూడా సమ్మర్ సీజన్‌లో తరచూ తీసుకుంటూ ఉండాలి.
తద్వారా వేసవి వేడిని తట్టుకునే శక్తి లభిస్తుంది.
నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!